న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెదరర్ అవుట్..! 'ఆందోళన అనవసరం.. ఫుట్‌బాల్ చూసేయొచ్చు'

I need to watch football, yells fan during Roger Federer vs Kevin Anderson Wimbledon marathon

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడటానికి అభిమానులు కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం.. ఫుట్‌బాల్‌-టెన్నిస్‌‌కు ఉమ్మడిగా అభిమానులు ఉండటమే. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్ ప్రత్యర్థి అండర్సన్ చేతిలో ఓడిపోవడంతో వింబుల్డన్ నుంచి నిష్క్రమించాడు. దీంతో అతనిపై కామెంట్లు విసురుతూనే ఫిఫాను ప్రశాంతంగా చూసేయొచ్చంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

ఎందుకంటే ఆదివారమే (జులై 15న) ఈ మెగా టోర్నీల ఫైనల్‌ జరగనుంది. వింబుల్డన్‌ ఫైనల్ మ్యాచ్‌ వేళల్లో ఏమన్నా మార్పులు చేస్తారా అని టోర్నీ నిర్వాహకులను అడగ్గా వారు అలాంటిది ఏమీ లేదని తేల్చి చెప్పేశారు. కానీ, ఇప్పుడు కొందరు అభిమానులు మాత్రం ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ చూసేందుకు సిద్ధమయ్యారు. తొమ్మిదో వింబుల్డన్‌ టైటిల్‌ గెలవాలన్న స్విస్‌ ఆటగాడు రోజర్‌ ఫెదరర్‌ ఆశలకు గండి పడింది.

టోర్నీలో భాగంగా క్వార్టర్స్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్‌ చేతిలో ఓడాడు. బుధవారం అండర్సన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి రెండు సెట్‌లను అలవోకగా సొంతం చేసుకున్న ఫెదరర్‌ మూడో సెట్‌లో చేసిన ఓ తప్పిదం కారణంగా మొత్తం మ్యాచ్‌నే కోల్పోయి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. నాలుగు గంటలకు పైగా హోరాహోరీగా సాగిన పోరులో ఫెదరర్‌ 6-2, 7-6 (7-5), 5-7, 4-6, 11-13తో పరాజయం చవిచూశాడు.

దీంతో టెన్నిస్‌ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. 'ఫెదరర్‌ ఓడాడు... ఇక ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ చూడాలనుకుంటున్నా' అంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పేర్కొంటున్నారు. జులై 15న ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ జరగనుంది. ఫైనల్లో ఫ్రాన్స్‌-క్రొయేషియా తలపడనున్నాయి. మరో పక్క వింబుల్డన్‌లో పోటీలు కూడా సెమీఫైనల్‌ దశకు చేరాయి. ఈ రోజు మహిళల సింగిల్స్‌ సెమీస్‌ జరగనుండగా, శుక్రవారం పురుషుల సింగిల్స్‌ సెమీస్‌ జరగనున్నాయి.

Story first published: Thursday, July 12, 2018, 14:20 [IST]
Other articles published on Jul 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X