న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open: స్టేడియానికొచ్చిన స్టార్‌ను చూసి ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ ఇగా స్వియాటెక్ షాకింగ్ రియాక్షన్...!

French Open: Iga Swiateks Shocking Reaction after seeing Poland Football star Robert Lewandowski in stands

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్‌వన్‌ పోలాండ్ ప్లేయర్ ఇగా స్వియాటెక్‌ గెలిచిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ విజేతగా ఆమె నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో తన జైత్రయాత్రను కొనసాగించిన స్వియాటెక్ 68నిమిషాల్లో 6-1, 6-3తేడాతో ప్రపంచ 23వ ర్యాంకర్, అమెరికన్ ప్లేయర్ అయిన 18ఏళ్ల కోకో గాఫ్‌‌పై గెలుపొందింది. ఇకపోతే ఈ విజయం ద్వారా ట్రోఫీతో పాటు భారీ నజరానాను స్వియాటెక్ గెలుచుకుంది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 22లక్షల యూరోలు దక్కాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 18కోట్ల 30లక్షల భారీ మొత్తం అన్నమాట. ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. పోలాండ్ ఫుట్‌బాల్ జాతీయ జట్టు కెప్టెన్ రాబర్ట్ లెవాండోస్కీ స్టాండ్స్‌లో కూచుని ఆద్యంతం మ్యాచ్ చూశాడు. ఇక ఈ మ్యాచ్ గెలిచిన అనంతరం.. స్వియాటెక్ స్టాండ్స్ లోకి వెళ్లి అతన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ఇక అతన్ని హగ్ చేసుకుంది. ఇక లెవాండోస్కీ సైతం చప్పట్లతో ఆమెను అభినందించాడు. ఇక లెవాండోస్కీని స్టాండ్స్‌లో చూసిన స్వియాటెక్ స్టన్ అయిపోయింది. ఆమె ఆశ్చర్యానికి గురైన టైంలో తీసిన ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు సైతం తమ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియో, ఫోటోల పట్ల నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

చెప్పలేనంత సంతోషంగా ఉంది..

ఇక బేయర్న్ మ్యూనిచ్ సూపర్‌స్టార్‌ అయిన రాబర్ట్ లెవాండోస్కీని చూసిన విషయమై స్వియాటెక్ మీడియాతో మాట్లాడుతూ.. ' హానెస్ట్లీ లెవాండోస్కీ స్టాండ్స్‌లో ఉండడం పట్ల చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. అతను పెద్ద టెన్నిస్ అభిమాని కాదో నాకు తెలియదు.. కానీ ఈ మ్యాచ్ కోసం అతను రావడం నిజంగా బాగుంది. అతను చాలా సంవత్సరాలుగా పొలాండ్ దేశ అత్యుత్తమ అథ్లెట్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ అతను నా ఆటను చూడడానికి కోర్టుకు వచ్చాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ' అని పేర్కొంది.

ఈ ఏడాది స్వియాటెక్ విజయ పరంపర

ఈ ఏడాది స్వియాటెక్‌ తన విజయపరంపర కొనసాగించింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌తో సహా కలిపి వరుసగా 35విజయాలు నమోదు చేసింది. 21ఏళ్ల స్వియాటెక్‌ 2020లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలిసారి విజేతగా నిలిచింది. ఇక రెండో దఫా ఈసారి అనూహ్యంగా ఫైనల్ చేరిన అమెరికన్ టీనేజర్ కోకో గాఫ్‌ ఆమెకు సవాల్ విసిరేందుకు రెడీ అయింది. అయితే స్వియాటెక్‌ భీకర ఫాంలో ఉండడంతో కోకో గాఫ్ తలవంచక తప్పలేదు. ఇక ఫైనల్లో కోకో గాఫ్‌ తీవ్ర ఒత్తిడికి గురయింది. రెండు సెట్లలో కలిసి కేవలం నాలుగు గేమ్‌లు మాత్రమే గెలిచింది.

ఏమాత్రం అవకాశమివ్వకుండా గెలుపు

పోలాండ్ టెన్నిస్ స్టార్.. లాంగ్ ర్యాలీలకు కోకో గాఫ్‌కు అవకాశమివ్వలేదు. పది ర్యాలీల్లోపే దాదాపు పాయింట్లు సాధించింది. తొలి సెట్‌ తొలి గేమ్‌లోనే గాఫ్‌ సర్వీస్‌ను స్వియాటెక్‌ బ్రేక్ చేసింది. ఇక గాఫ్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయిదో గేమ్‌లో గాఫ్‌ సర్వీస్‌ను కాపాడుకుని మళ్లీ పోటీలోకి వచ్చినా.. స్వియాటెక్ మాత్రం తన ఉనికిని కోల్పోకుండా మళ్లీ రాణించి.. 6-1తేడాతో గెలుపొందింది. రెండో సెట్‌లో కోకో, స్వియాటెక్‌ మధ్య కాస్త హోరాహోరీ సాగింది. కానీ స్వియాటెక్ చివర్లో అవకాశమివ్వకుండా రెండు సెట్లలోనే ఆటను ముగించింది.

Story first published: Sunday, June 5, 2022, 16:45 [IST]
Other articles published on Jun 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X