న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్‌ ఓపెన్‌కు వరణుడు అడ్డు.. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు వాయిదా

French Open 2019: A Day of Full Rain Shuffles the Schedule at the French Open

ఫ్రెంచ్‌ ఓపెన్‌నకు వరణుడు ఆడ్డుపడ్డాడు. కుండపోత వర్షం కురవడంతో బుధవారం జరగాల్సిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు గురువారానికి వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం బుధవారం.. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌.. ఐదోసీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో, థీమ్‌.. కచనోవ్‌తో తలపడాల్సి ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇక మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హలెప్‌.. అనిసిమోవా (అమెరికా)తో, మాడిసన్‌ కీస్‌ (అమెరికా).. బార్టీ (ఆస్ట్రేలియా)తో క్వార్టర్స్‌లో తలపడాలి. ఈ మ్యాచ్‌లన్నింటినీ గురువారం నిర్వహించనున్నారు. మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ శనివారం నిర్వహిస్తుండడంతో.. హలెప్‌ తుదిపోరు చేరాలంటే వరుసగా మూడు రోజులు, మూడు మ్యాచ్‌లు (గురు- క్వార్టర్స్‌, శుక్ర- సెమీస్‌, శనివారం- ఫైనల్‌) ఆడాల్సి ఉంటుంది.

మరోవైపు గురువారం జరగాల్సిన రఫెల్ నదల్‌, రోజర్ ఫెడరర్‌ మధ్య క్వార్టర్స్‌ మ్యాచ్ శుక్రవారానికి వాయిదా పడింది. వర్షం కారణంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఒక్క మ్యాచ్‌ జరగకుండానే ఒక రోజు వృథా కావడం 2000 తర్వాత ఇది మూడోసారి. 2016 తర్వాత ఇది రెండోసారి.

మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో నాదల్‌ (స్పెయిన్‌) 6-1, 6-1, 6-3తో ఏడో సీడ్‌ నిషికోరి (జపాన్‌)పై గెలుపొందాడు. మూడో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) 7-6 (7/4), 4-6, 7-6 (7/5), 6-4తో మాజీ చాంపియన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌)ను ఓడించాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో వీరిద్దరు తలపడనుండటం 2011 తర్వాత ఇదే తొలిసారి. మొత్తంగా వీరిద్దరు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఐదుసార్లు తలపడగా.. ఐదుసార్లూ నాదల్‌నే విజయం సాధించాడు.

Story first published: Thursday, June 6, 2019, 7:51 [IST]
Other articles published on Jun 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X