న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open: చరిత్ర నెలకొల్పిన ఎల్ సాల్వడార్ ప్లేయర్, పురుషుల డబుల్స్ టైటిల్ విన్నర్లుగా అరెవాలో, రోజర్ జోడీ

El Salvador star Marcelo Arevalo and the Netherlands Jean-Julian Roger won the French Open mens doubles title.

ఎల్ సాల్వడార్‌ దేశానికి చెందిన టెన్నిస్ స్టార్ మార్సెలో అరెవాలో, నెదర్లాండ్స్‌కు చెందిన జీన్-జూలియన్ రోజర్ జంట ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ గెలిచింది. 6-7 (4), 7-6 (5), 6-3తేడాతో క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడిగ్, అమెరికాకు చెందిన ఆస్టిన్ క్రాజిసెక్‌లను ఓడించిన ఈ జంట ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఛాంపియన్‌షిప్‌ను సగర్వంగా గెలుచుకుని ట్రోఫీ ముద్దాడింది. 40ఏళ్ల రోజర్ ప్రస్తుతం తరంలో అత్యధిక వయసులో గ్రాండ్ స్లామ్ పురుషుల డబుల్స్ ఛాంపియన్‌గా నిలిచిన ప్లేయర్‌గా నిలిచాడు. అతను 2017 యూఎస్ ఓపెన్ ఫైనల్లో హోరియా టెకావుతో కలిసి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకారం.. అరెవాలో సెంట్రల్ అమెరికా నుంచి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలిచిన తొలి వ్యక్తిగా నిలిచాడు.

అరెవాలో, రోజర్ 12వ సీడెడ్ ప్లేయర్లు కాగా.. ప్రత్యర్థులైన డోడిగ్, క్రాజిసెక్ సీడెడ్ ప్లేయర్లు కారు. ఇకపోతే రెండో సెట్‌లో డోడిగ్, క్రాజిసెక్ 6-5తో నిలిచి టైటిల్ ముద్దాడే క్షణాలకు చేరువ కాగా.. అరెవాలో, జీన్ జూలియన్ రోజర్ జంట భీకరంగా పుంజుకుంది. అతి కష్టమ్మీద రెండో సెట్ గెలిచిన అనంతరం.. మూడో సెట్ 6-3తేడాతో అలవోకగా గెలిచింది.

ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ సింగిల్స్ టైటిళ్లను గర్ల్ లూసీ హవ్లికోవా, బాయ్ గాబ్రియెల్ డెబ్రూ గెలుచుకున్నారు. రోలాండ్ గారోస్‌లో మహిళా జూనియర్ ఛాంపియన్‌గా నిలిచిన 17ఏళ్ల హవ్లికోవా.. చెక్ దేశానికి వరుసగా రెండోసారి కప్ అందించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆమె అర్జెంటీనాకు చెందిన సోలానా సియెర్రాపై 6-3, 6-3 తేడాతో విజయం సాధించింది. ఇకపోతే ఫ్రెంచ్‌కు చెందిన 16ఏళ్ల డెబ్రూ 7-6 (5), 6-3తో బెల్జియంకు చెందిన గిల్లెస్ అర్నాడ్ బెయిలీని ఓడించి బాలుర టైటిల్‌ను ఒడిసపట్టాడు. 1974-75 తర్వాత తొలిసారి ఆతిథ్య దేశానికి ఫ్రెంచ్ ఓపెన్ బాలుర సింగిల్స్ ఛాంపియన్‌ రెండోసారి దక్కింది. 2021లో లూకా వాన్ అస్చే బాలుర సింగిల్స్ ఛాంపియన్ షిప్ గెలుపొందాడు.

Story first published: Sunday, June 5, 2022, 13:34 [IST]
Other articles published on Jun 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X