న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కో టోర్నీ ఒక్కో రకంగా టై బ్రేకర్‌తో మ్యాచ్‌లలో మార్పులు

Australian Open Will Begin Using Final-Set Tiebreaker

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ నిబంధనల్లో పెనుమార్పు జరగబోతుంది. ఇకపై టోర్నీలో భాగంగా జరిగే మ్యాచ్‌లలో ఆఖరి సెట్లో నిర్ణీత గేమ్‌ల్లో ఫలితం తేలకుండా పోయే పద్ధతికి స్వస్తి పలకనున్నారు. ఈ మేరకు టై బ్రేకర్‌‌ను నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 24న ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఐతే ఆఖరి సెట్లో టైబ్రేకర్‌ నిర్వహించడం కొత్త పనేం కాదు.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో జరగడం లేదు కానీ, యూఎస్‌ ఓపెన్‌లో ఎప్పటినుంచో ఇదే పద్ధతి కొనసాగుతోంది.

ఇస్నర్‌-అండర్సన్‌ మ్యాచ్‌ 26-24 వెళ్లడమే

ఇస్నర్‌-అండర్సన్‌ మ్యాచ్‌ 26-24 వెళ్లడమే

ఇదే క్రమంలో వింబుల్డన్‌లో కూడా వచ్చే ఏడాది నుంచి ఇదే పద్ధతి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది టోర్నీలో ఇస్నర్‌-అండర్సన్‌ మధ్య మ్యాచ్‌లో ఆఖరి సెట్‌ స్కోరు 26-24 వరకు వెళ్లడం.. ఆ సెట్‌కు 3 గంటలకు పైగా సమయం పట్టడంతో ఈ నిబంధన తీసుకొచ్చారు. దీంతో మొత్తానికి ఒక్కో గ్రాండ్‌స్లామ్‌లో ఒక్కోలా ఆఖరి సెట్‌ ఫలితం తేలనుంది.

6-6 గేమ్‌లతో సమంగా ఉన్నప్పుడే

6-6 గేమ్‌లతో సమంగా ఉన్నప్పుడే

ఆస్ట్రేలియా ఓపెన్‌లో చివరి సెట్లో క్రీడాకారులు 6-6 గేమ్‌లతో సమంగా ఉన్నప్పుడు టైబ్రేకర్‌ అమల్లోకి వస్తుంది. రెండు పాయింట్ల అంతరంతో మొదట 10 పాయింట్లకు చేరుకున్న ఆటగాడు విజేతగా నిలుస్తాడు.

12-12 గేమ్‌లతో వింబుల్డన్‌‌లో సమానమైతే

12-12 గేమ్‌లతో వింబుల్డన్‌‌లో సమానమైతే

వింబుల్డన్‌లో చివరి సెట్లో ఆటగాళ్లు 12-12 గేమ్‌లతో సమానంగా ఉన్నప్పుడు టైబ్రేకర్‌ నిర్వహిస్తారు. 2 పాయింట్ల అంతరంతో మొదట 7 పాయింట్లు నెగ్గిన ఆటగాడే విజేతగా నిలుస్తాడు.

యూఎస్ ఓపెన్ తొలి 7 పాయింట్లే టార్గెట్

యూఎస్ ఓపెన్ తొలి 7 పాయింట్లే టార్గెట్

యూఎస్‌ ఓపెన్లో సంప్రదాయ పద్ధతి కొనసాగుతోంది. చివరి సెట్లో రెండు పాయింట్ల అంతరంతో మొదట ఏడు పాయింట్లు సాధించిన ఆటగాడిదే టైటిల్‌. ఫ్రెంచ్‌ ఓపెన్లో ఆఖరి సెట్‌ టైబ్రేకర్‌ లేదు. చివరి సెట్లో ఎవరు ముందుగా రెండు గేమ్‌ల అంతరంతో నిలుస్తారో వాళ్లే విజేతలు.

Story first published: Sunday, December 23, 2018, 15:56 [IST]
Other articles published on Dec 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X