న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాల్ గర్ల్‌ను అరటి పండు తొక్క తీయమన్నందకు నెటిజన్లు అతడి తొక్క తీశారు!

Australian Open: Tennis player asks ball-girl to peel banana for him, gets scolded by umpire - WATCH

హైదరాబాద్: మెల్‌బోర్న్‌‌లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మంగళవారం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అరటిపండు తొక్క కూడా తీసిస్తావా? అని బాల్‌ గర్ల్‌ను అడిగిన ఫ్రెంచ్‌ ఆటగాడు ఇలియట్‌ బ్రెంచెట్రిట్‌‌పై చైర్ అంఫైర్ మండిపడ్డాడు. వివరాల్లోకి వెళితే... ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో విరామ సమయంలో ఇలియట్‌కు బాల్‌ గర్ల్ అరటిపండు ఇచ్చింది.

అయితే, అరటిపండు తొక్క తీసివ్వవా? అంటూ బాల్ గర్ల్‌ను అడిగాడు. తొక్క తీసేందుకు బాల్ గర్ల్ ప్రయత్నిస్తున్న క్రమంలో వెంటనే జోక్యం చేసుకున్న చైర్‌ అంపైర్‌ జాన్‌ బ్లోమ్‌ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అరటి పండు తొక్కకూడా తీసుకోలేకపోతున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అరటి పండుని తిరిగి బాల్ గర్ల్ అతడికి ఇవ్వగా అతడే తొక్క తీసుకుని తిన్నాడు.

'బాంటన్‌ ఐపీఎల్‌ ఆడొద్దు.. ఆలోచించి నిర్ణయం తీసుకో''బాంటన్‌ ఐపీఎల్‌ ఆడొద్దు.. ఆలోచించి నిర్ణయం తీసుకో'

అయితే, తానేమీ కావాలని బాల్ గర్ల్‌ను తొక్క తీసివ్వమని అడగలేదని... చేతికి క్రీమ్‌ రాసుకున్న కారణంగా తొక్క తీసివ్వమని అడిగానని అంపైర్‌తో ఇలియట్‌ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇలియట్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

"ఒక అమ్మాయి అరటిపండు తొక్క తీయడం నాకు లైంగిక వేధింపుల వలే కనిపిస్తుంది. ఇతడిపై దర్యాప్తుకు ఆదేశించాలి. ఆమె ఏమీ అతని పని మనిషి కాదనే విషయం గుర్తుంచుకోవాలి" అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మరొక నెటిజన్ అయితే తన వ్యక్తిగత పనులకు బాల్‌ గర్ల్‌ని ఉపయోగించుకోవడం ఏంటని ప్రశ్నించాడు.

న్యూజిలాండ్ ప్రపంచకప్ ఫైనల్‌ చేరితే మేం సంతోషించాం : కోహ్లీన్యూజిలాండ్ ప్రపంచకప్ ఫైనల్‌ చేరితే మేం సంతోషించాం : కోహ్లీ

Story first published: Thursday, January 23, 2020, 14:40 [IST]
Other articles published on Jan 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X