న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అయ్యో మరియా.. తొలి రౌండ్‌ నుండే షరపోవా నిష్క్రమణ!!

Australian Open 2020: Maria Sharapova suffers 1st round exit in 3rd grand slam in a row

మెల్‌బోర్న్‌: ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత, మాజీ నంబర్‌వన్‌ మరియా షరపోవా (రష్యా) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ప్రపంచ 20వ ర్యాంకర్‌ డోనా వెకిచ్‌ (క్రొయే షియా)తో జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 145వ ర్యాంకర్‌ షరపోవా 3-6, 4-6తో ఓడిపోయింది. 81 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.

వరుసగా ఐదుగురు డకౌట్.. 41 పరుగులకే జపాన్ ఆలౌట్.. భారత్ లక్ష్యం 42వరుసగా ఐదుగురు డకౌట్.. 41 పరుగులకే జపాన్ ఆలౌట్.. భారత్ లక్ష్యం 42

షరపోవా 2008 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ చాంపియన్.. 2007, 2012, 2015 రన్నరప్‌ టైటిళ్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిన షరపోవా.. ఈసారి తొలి రౌండ్‌లోనే వెనుదిరగడంతో ఫిబ్రవరి 3న విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 350వ స్థానానికి పడిపోయే అవకాశముంది. 'వైల్డ్‌ కార్డు'తో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో అడుగుపెట్టిన షరపోవా.. కెరీర్‌ తిరోగమనంలో పయనిస్తోంది. 2016 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సందర్భంగా డోప్‌ పరీక్షలో విఫలమై 15 నెలల నిషేధానికి గురైన షరపోవా.. 2017 ఏప్రిల్‌లో మళ్లీ రాకెట్‌ పట్టింది.

మహిళల సింగిల్స్‌ ఇతర మ్యాచ్‌లలో రెండో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), నాలుగో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా), ఐదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), ఆరో సీడ్‌ బెలిండా బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌), తొమ్మిదో సీడ్‌ కికి బెర్‌టెన్స్‌ (నెదర్లాండ్స్‌), పదో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా), మాజీ చాంపియన్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. అయితే 12వ సీడ్‌ జొహనా కొంటా (బ్రిటన్‌) మాత్రం తొలి రౌండ్‌లో ఓడిపోయింది.

ఇక పురుషుల సింగిల్స్‌లో మాత్రం ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) 6-2, 6-3, 6-0తో డెలియన్‌ (బొలీవియా)పై సునాయాస విజయాన్ని అందుకుని రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 2 గంటల 2 నిమిషాల పాటు మ్యాచ్‌ జరుగగా.. రఫా పూర్తి ఆధిపత్యం చూపాడు. బలమైన బ్యాక్‌హ్యాండ్‌ షాట్లతో విరుచుకుపడ్డాడు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ డేనిల్‌ మద్వెదెవ్‌(రష్యా) 6-3, 4-6, 6-4, 6-2తేడాతో అన్‌సీడెడ్‌ అమెరికా ఆటగాడు ఫ్రాన్సెస్‌ టియాఫోపై రెండున్నర గంటలకు పైగా చెమటోడ్చి నెగ్గాడు. కాగా, 12వ సీడ్‌ ఫాబియో ఫొగ్నిని(ఇటలీ) కాస్తలో ఓటమి తప్పించుకున్నాడు.

Story first published: Wednesday, January 22, 2020, 8:18 [IST]
Other articles published on Jan 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X