Ashleigh Barty: ఆస్ట్రేలియా టెన్నిస్ బ్యూటీ సంచలన నిర్ణయం.! 25 ఏళ్లకే..

సిడ్నీ: ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్, ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ యాష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. ఈ సీజన్ ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ నెగ్గిన యాష్లే బార్టీ.. 44 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ సాధించిన రెండో ఆస్ట్రేలియన్‌ మహిళా ప్లేయర్‌గా బార్టీ చరిత్ర సృష్టించింది. ఇంతకముందు 1978లో క్రిస్‌ ఓనిల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన తొలి ఆస్ట్రేలియన్‌ మహిళగా నిలిచింది.

ఇంత గొప్ప విజయం సాధించిన యాష్లే బార్టీ అంతలోనే రిటైర్మెంట్ ప్రకంటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన యాష్లే బార్టీ.. ఈ కఠిన నిర్ణయం వెనుకు ఉన్న బలమైన కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. పూర్తి వివరాలను ప్రెస్‌మీట్ వెల్లడిస్తానని పేర్కొంది.

చాలా కష్టంగా ఉంది..

'టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నాననే మాట వెల్లడించడం చాలా కష్టంగా ఉంది. నా మనసు భావోద్వేగంతో నిండి ఉంది. ఈ విషయాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. అందుకే నా స్నేహితురాలి సలహా తీసుకున్నా. ఈ టెన్నిస్‌ నాకు ప్రతీది అందించింది. నేను తలెత్తుకునేలా చేసింది. జీవితంలో ఎంతో సంతృప్తినిచ్చింది. ఇన్ని ఇచ్చిన టెన్నిస్‌కు నేనేప్పుడు కృతజ్ఞురాలిగా ఉంటాను. ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. జీవితాంతం గుర్తుండిపోయే మధర జ్ఞాపకాలు లభించాయి.'అని యాష్లే బార్టీ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది.

ప్రొఫెషనల్ క్రికెటర్..

ప్రొఫెషనల్ క్రికెటర్..

ఇక యాష్లే బార్టీ గురించి మనకు తెలియని యాంగిల్‌ ఒకటి దాగుంది. టెన్నిస్ ప్లేయరే కాకుండా ఆమె ప్రొఫెషనల్ క్రికెటర్ కూడా. 2015లో బిగ్‌బాష్ లీగ్ కూడా ఆడింది. 2014 యూఎస్‌ ఓపెన్‌ తర్వాత యాష్లే బార్టీ సుధీర్ఘ విరామం తీసుకుంది. ఆ సమయంలో ఆమెను టెన్నిస్‌ను పూర్తిగా వదిలేసి.. ఒక సాధారణ టీనేజీ అమ్మాయిలా జీవితం కొనసాగించింది. ఈ సమయంలోనే ఆమెకు క్రికెట్‌వైపు మనసు మళ్లింది. అలా 2015లో బార్టీ క్రికెట్‌వైపు అడుగులు వేసింది. అనుకుందే తడవుగా క్వీన్స్‌లాండ్‌ ఫైర్‌కు క్రికెట్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆండీ రిచర్డ్స్‌ను కలిసి తన మనసులోని కోరికను బయటపెట్టింది. బార్టీ వచ్చి తనను అడిగిన విధానం రిచర్డ్స్‌కు బాగా నచ్చి ఆమెకు క్రికెట్‌లో మెళుకువలు నేర్పాడు. కొన్ని నెలల్లోనే క్రికెట్‌పై మంచి పట్టు సాధించిన బార్టీ వెస్ట్రన్‌ సబరబ్స్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ క్లబ్‌కు ఆడింది. ఆ తర్వాత బ్రిస్బేన్‌ వుమెన్స్‌ ప్రీమియర్‌ టీ20 లీగ్‌లో యాష్లే బార్టీ పాల్గొంది.

బిగ్‌బాష్ లీగ్‌లో దంచి కొట్టింది..

బిగ్‌బాష్ లీగ్‌లో దంచి కొట్టింది..

వెస్ర్టన్‌ సబ్‌రబ్స్‌ తరపున ఫైనల్లో బార్టీ 39 బంతుల్లో 37 పరుగులు చేసి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో బిగ్‌బాష్‌ లీగ్‌ ఫ్రాంచైజీ బ్రిస్బేన్‌ హీట్‌ ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది. 2015 బిగ్‌బాష్‌ లీగ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ తరపున బరిలోకి దిగిన యాష్లే బార్టీ మెల్‌బోర్న్‌ స్టార్స్‌తో జరిగిన డెబ్యూ మ్యాచ్‌లో 27 బంతుల్లో 39 పరుగులు చేసింది. ఆ సీజన్‌లో బార్టీ రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగింది. ఈ సీజన్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ 14 మ్యాచ్‌ల్లో ఏడు మ్యాచ్‌లు గెలిచింది. ఇక 2016లో యాష్లే బార్టీ తిరిగి టెన్నిస్‌లోకి అడుగుపెట్టింది. వస్తూనే పారిస్‌ వేదికగా రోలాండ్‌ గారోస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో విజృంభించిన బార్టీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక అక్కడి నుంచి బార్టీకి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, March 23, 2022, 9:36 [IST]
Other articles published on Mar 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X