న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఢిల్లీ ఎఫెక్ట్: మాస్క్‌లతోనే మ్యాచ్‌లకు సిద్ధమవుతోన్న ప్లేయర్లు

Women boxers wear masks to beat Delhi pollution, Gautam Gambhir says his head hangs in shame

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని వాయు కాలుష్యం మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్స్ కోసం వచ్చిన బాక్సర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రక్షిత ప్రమాణాలకు 8 రెట్లు అధికంగా నమోదవుతున్న కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన వారంతా ముఖానికి మాస్క్‌లు, రుమాళ్లను అడ్డుగా పెట్టుకుంటున్నారు. వాహనాలు, ఫ్యాక్టరీల ద్వారా వచ్చే పొగతో పాటు రైతులు తమ పంట కోత తర్వాత మిగిలే వ్యర్థాన్ని పెద్ద ఎత్తున తగలబెట్టడం కూడా ఈ సమస్యకు కారణంగా మారింది.

గాలి పెద్దగా లేని వాతావరణం కూడా ఢిల్లీలో సమస్య తీవ్రతను పెంచుతోంది. దాంతో పాటు వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాలు ఉండనే ఉన్నాయి. అక్కడి వాతావరణం సురక్షిత స్థాయిని మించి ఎన్నోరెట్లు కాలుష్యంతో నిండిపోయి ఉంది. గురువారం నుంచి ఢిల్లీలోని ఇండోర్‌ స్టేడియంలో మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి. ఆ కాలుష్యపు‌ స్థాయిలపై క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఫిర్యాదులు చేస్తున్నారు.

తల కొట్టేసినట్టుగా అనిపిస్తుంది.

వారు మాస్క్‌లు ధరించడంతో పాటు, టీ షర్టులతో, స్కార్ఫ్‌లతో మొహాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ఇబ్బందులు పడుతోన్న క్రీడాకారుల ఫొటోలు కొన్ని భారత క్రికెటర్‌ గౌతమ్ గంభీర్ దృష్టికి వచ్చాయి. అందులో ఒక ఫొటోను ట్విటర్‌లో షేర్ చేస్తూ..‘తల కొట్టేసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఎవరు లెక్క చేస్తారు' అని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఇది మా శరీరానికి మంచిది కాదని

ఇది మా శరీరానికి మంచిది కాదని

'ఢిల్లీలో నెలకొన్న పరిస్థితితో మా కుటుంబం ఆందోళన చెందుతోంది. ఇది మా శరీరానికి మంచిది కాదని తెలుసని' బల్గేరియన్‌ క్రీడాకారిణి ఒకరు వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో వాయు నాణ్యత సురక్షిత స్థాయి కంటే 80 రెట్లు క్షీణించిందని కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.

స్వచ్ఛమైన గాలి ఉండే ఫిన్‌లాండ్‌ నుంచి

స్వచ్ఛమైన గాలి ఉండే ఫిన్‌లాండ్‌ నుంచి

‘ఇక్కడి పరిస్థితిపై నా కుటుంబం తీవ్రమైన ఆందోళనలో ఉంది. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి ఉండే ఫిన్‌లాండ్‌ నుంచి వచ్చాను. కానీ ఇక్కడ శ్వాస తీసుకునేందుకే ఇబ్బందిగా ఉంది. అందుకే స్కార్ఫ్‌ ధరిస్తున్నాను' అని బాక్సర్‌ మోనా మెట్సియాన్‌ తెలిపింది.

కాలుష్యం కారణంగా కళ్లల్లో మంటగా

కాలుష్యం కారణంగా కళ్లల్లో మంటగా

కాలుష్యం కారణంగా తమ కళ్లల్లో మంటగా ఉంటోందని ఇప్పటికే ఏడుగురు యూరోపియన్‌ బాక్సర్లు ఫిర్యాదు చేశారు. అయినా నిర్వాహకులు వారికి ఎలాంటి రక్షణ పరికరాలను ఇవ్వడం లేదు. మరోవైపు ఢిల్లీలో అత్యంత ఆధునిక సౌకర్యాలు ఉండడంతో వేదిక మార్పు అనేది అసంభవమని భారత బాక్సింగ్‌ సమాఖ్య ప్రధాన కార్యదర్శి జే కోవ్లీ తెలిపారు.

Story first published: Wednesday, November 14, 2018, 9:40 [IST]
Other articles published on Nov 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X