న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా విసిరి 90కి చేరుకుంటావనే నమ్మకం నాకుంది; సెహ్వాగ్

Witty Sehwag Congratulates Javelin Ace Neeraj Chopra For Gold in Savo Games

హైదరాబాద్: ఆసియా క్రీడలకు ముందు నీరజ్‌ అదిరే ఫామ్‌ను కొనసాగించడం విశేషం. భారత జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మరోసారి మెరిశాడు. ఆసియా క్రీడలకు ముందు అదిరే ఫామ్‌ను కొనసాగిస్తూ మరో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఫిన్లాండ్‌లో జరిగిన సావో గేమ్స్‌లో జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించిన భారత్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాను టీమిండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభినందించాడు.

ఫిన్లాండ్‌లో జరుగుతున్న సావో గేమ్స్‌లో అతడు విజేతగా నిలిచాడు. రాజస్తాన్‌కు చెందిన నీరజ్‌.. జావెలిన్‌ను 85.69 మీటర్లు విసరగా, చైనీస్‌ తైపీకి చెందిన చావో-సున్‌-చెంగ్స్‌ 82.52 మీటర్లతో రజతం సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆసియా నుంచి అత్యుత్తమ ప్రదర్శన (87.43మీ) నీరజ్‌ చోప్రాదే.

కామన్వెల్త్‌ క్రీడల విజేత అయిన నీరజ్‌ జావెలిన్‌ను 85.69 మీటర్లు త్రో చేసి చాంపియన్‌గా నిలిచాడు. ఆసియా రికార్డు హోల్డరైన చైనీస్‌ తైపీ అథ్లెట్‌ చావో సన్‌ చెంగ్‌ (82.52 మీ.) రెండోస్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇదే వేగంతో అతడు జావెలిన్‌ను విసిరితే ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లో దేశాన్ని గర్వపడేలా చేస్తాడని ట్వీట్‌ చేశాడు.

'ఫిన్లాండ్‌ సావో గేమ్స్‌లో జావెలిన్‌ను 85.69 మీటర్లు విసిరి స్వర్ణం సాధించిన విజేత నీరజ్‌ చోప్రాకు అభినందనలు. నువ్విలాగే జావెలిన్‌ను బలంగా విసిరుతూ ఉంటే త్వరగానే 90 మీటర్లకు చేరుకోగలవు. ఆసియా క్రీడలు, టోక్యో 2020 ఒలింపిక్స్‌ క్రీడల్లో దేశం గర్వపడేలా చేస్తావన్న నమ్మకం నాకుంది' అని సెహ్వాగ్‌ ట్వీటాడు.

Story first published: Monday, July 30, 2018, 18:04 [IST]
Other articles published on Jul 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X