న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాక్సింగ్: నిన్ను మట్టి కరిపిస్తా.. నీ ఎముకలు విరిచేస్తా..

 Vijender Singh, Ernest Amuzu Indulge In War of Words Ahead Of Double Title Fight

హైదరాబాద్: ఢీ అంటే ఢీ అంటూ మాటలతోనే యుద్ధం చేసుకున్నారు. ఇక సమయం లేదు సమరమే మిగిలి ఉంది. ఇప్పుడు దాన్లోనూ నేనంటే నేను అని పోటీ పడుతున్నారు. భారత యోధుడు, రాజస్థాన్ హీరో విజేందర్ డిసెంబరు 23న ఘనా ప్రొ బాక్సర్‌ ఎర్నెస్ట్‌ అముజుతో ఈ శనివారం విజేందర్‌ సింగ్‌ తలపడనున్నాడు. ఈ పోటీ నిమిత్తం ఒకరినొకరు ఎప్పటినుంచో హెచ్చరించుకుంటున్న సంగతి తెలిసిందే.

ప్రొఫెషనల్‌ బాక్సర్లు విజేందర్‌ సింగ్‌-అముజు.. ఈ నేపథ్యంలో ఇప్పటికే వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొన్ని వారాల ముందే మొదలైంది. మీ హీరోను మట్టి కరిపిస్తానని గతంలో ఎర్నెస్ట్‌ వ్యాఖ్యలు చేశాడు. 'నా సత్తా ఏంటో చూపిస్తా ' అని విజేందర్ సింగ్ బదులిచ్చాడు. శనివారం జరగనున్న బౌట్‌లో విజయం నాదంటే కాదు నాదని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'అముజుతో పోరు కోసం గత రెండు నెలలుగా ఎంతో సాధన చేస్తున్నాను. ఫిజికల్‌గా, మెంటల్‌గా పోరుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యా. ఈ ఏడాది విజయంతో ముగించాలని ఎదురుచూస్తున్నాను. ప్రత్యర్థి ఎర్నెస్ట్‌ ఎంతో అనుభవం కలవాడు. నా కంటే ఎక్కువ రౌండ్లు ఆడిన అనుభవం అతనికి ఉంది. సాంకేతిక అంశాలపై దృష్టిపెట్టి ప్రత్యర్థిని పడగొట్టే ప్రయత్నంలో ఉన్నా. పటిష్టమైన వ్యూహాలతో అతన్ని ఎదుర్కోబోతున్నానని అని తెలిపాడు.

దానికి స్పందించిన ఎర్నెస్ట్‌ ..
'ఇండియాలోనూ నా జైత్రయాత్రను కొనసాగిస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు. తొమ్మిది బౌట్లు గెలిచిన విజందర్‌ నాకు పెద్దగా పోటీ ఇవ్వలేడు. విజేందర్‌ పోరుకు ముందు నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. నిద్రలేని రాత్రులు లేవు. అతన్ని బౌట్‌లో చిత్తు చేస్తా. అతడికి నాతో పోరే నిజమైన సవాలు' అని ఎర్నెస్ట్‌ తెలిపాడు.

ఎర్నెస్ట్ 2002లో కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొన్నాడు. ఆఫ్రికా బాక్సింగ్ పోటీల్లో 2004లో, ఆఫ్రికా ఛాంపియన్ షిప్ పోటీల్లో 2003, 2005లో పాల్గొని విజయం పొందాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 21, 2017, 14:16 [IST]
Other articles published on Dec 21, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X