న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Krishna Nagar: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం

Tokyo Paralympics: Krishna Nagar clinched the gold, defeated Hong Kong’s Chu Man Kai at finals

టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా సాగుతోన్న పారాలింపిక్స్‌లో భారత తిరుగులేని విజయాలను సాధిస్తోంది. పతకాల పంట పండిస్తోంది. వెంటవెంటనే పతకాలను అందుకుంటోంది. తొలుత రజతం.. ఆ తరువాత స్వర్ణ పతకాన్ని ముద్దాడింది భారత్. ఇప్పటికే భారత్ ఖాతాలో 18 పతకాలు పడ్డాయి. తాజాగా- మరో మెడల్‌ను అందుకుంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ 6 కేటగిరీలో పసిడి పతకం లభించింది. దీనితో మొత్తం మెడల్స్ సంఖ్య 19కి చేరింది. ఇందులో అయిదు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఎనిమిది రజతం, ఆరు కాంస్య పతకాలతో భారం 24వ స్థానంలో కొనసాగుతోంది.

రన్నరప్‌గా

కొద్దిసేపటి ముగిసిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ 6 కేటగిరి ఫైనల్స్ మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహించిన పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ కృష్ణ నగర్ ఘన విజయాన్ని సాధించారు. ఫైనల్స్ మ్యాచ్‌లో ఆయన హాంకాంగ్‌కు చెందిన కై మన్ చును ఓడించారు. పోడియంపై టాప్‌లో నిలిచారు. సగర్వంగా స్వర్ణ పతకాన్ని అందుకున్నారు. దీనితో భారత్ ఖాతాకు చేరిన బంగారు పతకాల సంఖ్య అయిదుకు పెరిగింది.

హోరాహోరీ పోరు..

బంగారు పతకం కోసం సాగిన పోరులో కృష్ణ నగర్ అద్భుతంగా ఆడాడు. దూకుడును ప్రదర్శించాడు. మూడు సెట్లుగా ఈ సాగిన ఈ మ్యాచ్‌లో నిర్ణయాత్మక మూడో సెట్‌ను గెలుచుకుని బంగారు పతకాన్ని ముద్దాడాడీ రాజస్థాన్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్.

తొలి సెట్‌లో సుహాస్ అద్భుతంగా ఆడారు. 21-17 స్కోర్‌తో దాన్ని సొంతం చేసుకున్నారు. రెండో సెట్‌‌లో ప్రత్యర్థి విజృంభించాడు. మెరుపులాంటి షాట్లను ఆడాడు. ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగింది ఈ సెట్‌లో. చివరికి 16-21 తేడాతో కృష్ణ నగర్ ఈ సెట్‌ను ప్రత్యర్థికి కోల్పోయాడు.

మూడో సెట్‌లో బౌన్స్ బ్యాక్..

నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లోనూ ఇద్దరి మధ్య హైఓల్టేజ్ పోరు సాగింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటూ వెళ్లారు. ఒకదశలో ఇద్దరు ప్రతి స్కోర్‌లోనూ సమవుజ్జీలుగా కనిపించారు. 13-13 స్కోర్‌తో మూడో సెట్‌లో కై మన్ చు సమంగా నిలిచాడు. ఆ తరువాత కృష్ణ నగర్ ఒక్కసారిగా గేర్ మార్చారు. టాప్ గేర్‌లో దూసుకెళ్లారు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా భారీ ఆధిక్యాన్ని అందుకున్నాడు. విజయం సాధించడానికి కృష్ణ నగర్ రెండు పాయింట్ల దూరంలో ఉన్నప్పుడు కై మన్ చు స్కోర్ 16 మాత్రమే. చివరి షాట్‌ను విజయవంతంగా ముంగించి.. విజేతగా నిలిచారు.

హర్షాతిరేకాలు..

కృష్ణ నగర్ సాధించిన ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హర్షం వ్యక్త చేశారు. కోట్లాదిమంది యువతకు స్ఫూర్తి ఇచ్చారని ప్రశంసించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కృష్ణ నగర్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అద్భుత విజయాన్ని అందుకున్నారని కొనియాడారు. రాష్ట్రం పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని చెప్పారు. తాము ఈ పతకం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్నామని కృష్ణ నగర్ తండ్రి సునీల్ నగర్ వ్యాఖ్యానించారు.

Story first published: Sunday, September 5, 2021, 11:11 [IST]
Other articles published on Sep 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X