న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: కనీస పోటీఇవ్వకుండానే.. టీటీ రెండో రౌండ్​లో సుతీర్ధ ముఖర్జీ పరాజయం!!

Tokyo Olympics: Sutirtha Mukherjee bows out of womens singles event after losing in Round 2

టోక్యో: ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌ 2021లో భారత్ పతకాల వేటలో వెనకపడిపోయింది. వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి చాను తెచ్చిన రజతం తప్ప మరోకటి లేదు. రెండో రోజు మన అథ్లెట్లు చాలా వరకు నిరాశపరిచారు. మూడో రోజు కూడా అదే కొనసాగుతోంది. టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల రెండో రౌండ్‌లో ఆచంట శరత్‌ కమల్‌ విజయం సాధించగా.. మహిళల రెండో రౌండ్‌లో సుతీర్ధ ముఖర్జీ ఓటమిపాలైంది. కనీస పోటీ ఇవ్వకుండనే సుతీర్ధ నిష్క్రమించింది.

Mirabai Chanu: మీరాకు బంపర్‌ ఆఫర్‌.. జీవిత‌కాలం ఫ్రీగా పిజ్జా!!Mirabai Chanu: మీరాకు బంపర్‌ ఆఫర్‌.. జీవిత‌కాలం ఫ్రీగా పిజ్జా!!

టేబుల్‌ టెన్నిస్‌ మహిళా సింగిల్స్ ఈవెంట్‌లో భాగంగా సోమవారం ఉదయం జరిగిన రౌండ్ 2 మ్యాచ్‌లో పోర్చుగల్‌కు చెందిన ఫూ యుతో సుతీర్ధ ముఖర్జీ తలపడింది. యూ ఫూ చేతిలో సుతీర్ధ 4-0 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్​ ప్రారంభం నుంచి పోర్చుగల్‌ ప్లేయర్​ దూకుడు ప్రదర్శించగా.. సుతీర్ధ కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. ఒక్క గేమ్‌లో కూడా సుతీర్ధ ప్రభావం చూపకపోవడంతో మ్యాచ్ కేవలం 23 నిమిషాల్లోనే ముగిసింది. సింగిల్స్ ఈవెంట్‌లో సుతీర్ధ కథ ముగిసింది.

World Cadet Wrestling Championship : Priya Malik Clinches Gold For India | Oneindia Telugu

టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల రెండో రౌండ్‌లో ఆచంట శరత్‌ కమల్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. పోర్చుగల్ ప్లేయర్ అపోలోనియా టియాగోపై 4-2 తేడాతో అద్భుత విజయం సొంతం చేసుకున్నాడు. 49 నిమిషాల్లోనే వరల్డ్‌ 59వ ర్యాంక్‌ ఆటగాడిని 2-11 11-8 11-5 9-11 11-6 11-9 స్కోర్‌తో మట్టికరిపించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మరోవైపు టేబుల్‌ టెన్నిస్‌ మహిళల విభాగంలో మనికా బాత్రా మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది.

Story first published: Monday, July 26, 2021, 11:05 [IST]
Other articles published on Jul 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X