న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: 100 మీట‌ర్ల ప‌రుగు పందెంలో నయా చాంపియ‌న్‌.. ఇట‌లీ స్ప్రింట‌ర్‌కు గోల్డ్‌!!

Tokyo Olympics 2021: Italian athlet Lamont Marcell Jacobs wins Gold medal in mens 100-meter race

టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌ 2020లో సంచలనం నమోదైంది. ప్రపంచంమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 100 మీటర్ల పరుగు పందెంలో ఇటలీకి చెందిన అథ్లెట్‌ లామోంట్‌ మార్సెల్‌ జాకబ్స్‌ గోల్డ్ మెడల్ అందుకున్నాడు. కేవలం 9.80 సెకన్లలో అతడు గమ్యాన్ని చేరుకున్నాడు. ఇకఅమెరికాకు చెందిన అథ్లెట్‌ ఫ్రెడ్‌ కెర్లీ (9.84 సెకన్లు) రజతం, కెనడాకు చెందిన అథ్లెట్‌ ఆండ్రీ డి గ్రాస్సే (9.89 సెకన్లు) కాంస్యం దక్కించుకున్నారు. మొత్తానికి జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌ లేకుండా జ‌రిగిన ఈ రేసులో ఎవరి ఊహకూ అందని రీతిలో కొత్త చాంపియ‌న్ అవ‌త‌రించాడు.

Tokyo Olympics 2021: పీవీ సింధు దేశానికే గ‌ర్వ‌కార‌ణం.. క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, హిందూలను కలిపే సింధు!!Tokyo Olympics 2021: పీవీ సింధు దేశానికే గ‌ర్వ‌కార‌ణం.. క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, హిందూలను కలిపే సింధు!!

3డీ ఇమేజ్‌:

గ‌త మూడు ఒలింపిక్స్‌లో 100 మీట‌ర్ల రేసు అంటే ఉసేన్ బోల్ట్‌దే గోల్డ్ మెడ‌ల్ అని ఫిక్స‌యిపోయి చూసేవారు. కానీ ఈసారి అత‌డు లేకుండా జ‌రిగిన ఈ రేసులో ఓ కొత్త చాంపియ‌న్ అవ‌త‌రించాడు. లామంట్ మార్సెల్ జాకబ్స్ 9.8 సెక‌న్ల‌లో రేసు పూర్తి చేసి ఒలింపిక్ చాంపియ‌న్‌గా నిలిచాడు. తాజా ఒలింపిక్స్‌కు వచ్చే ముందు జాకబ్‌ మాట్లాడుతూ... 'టోక్యోలో మెడల్‌ సాధించటానికి వెళ్తున్నా. ఎందుకంటే ఉసేన్ బోల్ట్‌ లేడు. కోల్‌మెన్‌ కూడా లేడు. 100 మీటర్ల పరుగులో హాట్‌ఫేవరెట్‌ ఎవరో తెలియదు. ఇదొక యుద్ధం. నేను కలలు కనడం కొనసాగుతుంది' అని అన్నాడు. చివరకు తన కల సాకారం చేసుకున్నాడు. 100 మీట‌ర్ల రేసులో పాల్గొన్న అథ్లెట్ల‌ను ఒలింపిక్స్‌ నిర్వాహ‌కులు అథ్లెటిక్ స్టేడియంలో వినూత్నంగా చూపించారు. లైట్ల‌న్నీ ఆఫ్ చేసి 12 ప్రొజెక్ట‌ర్ల‌తో ఈ అథ్లెట్ల 3డీ ఇమేజ్‌ల‌ను ప్ర‌ద‌ర్శించారు.

స్విమ్మింగ్‌, బాస్కెట్‌ బాల్‌ కూడా:

మార్సెల్‌ జాకబ్స్‌ 1994 సెప్టెంబరు 24 అమెరికాలోని టెక్సాస్‌లో జన్మించాడు. జాకబ్స్‌ తల్లి వివియానా ఇటలీకి చెందిన వారు. తండ్రి అమెరికన్‌. జాకబ్స్‌ తండ్రి యూఎస్‌ ఆర్మీలో పనిచేసేవారు. వృత్తి రిత్యా ఆయన సౌత్‌ కొరియాకు వెళ్లిపోయారు. దీంతో జాకబ్స్‌ను తీసుకుని ఆమె తల్లి వివియానా ఇటలీకి వచ్చేసింది. మార్సెల్‌కు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలాచాలా ఇష్టం. అతను అథ్లెట్‌ కాకముందు పలు క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు. స్విమ్మింగ్‌, బాస్కెట్‌ బాల్‌ కూడా ఆడేవాడు.

లాంగ్‌ జంప్‌లో ఎన్నో విజయాలు:

ఫుట్‌బాల్‌ సాధన చేస్తున్న క్రమంలో స్కూల్‌ కోచ్‌ పిలిచి 'నువ్వు చాలా వేగంగా కనిపిస్తున్నావు. ఇంకేదైనా స్పోర్ట్స్‌ ట్రై చేయి. అథ్లెట్‌ అయితే బాగుంటుంది' అని మార్సెల్‌ జాకబ్స్‌కు సలహా ఇచ్చారట. దీంతో జాకబ్స్‌ లాంగ్‌ జంప్‌పై దృష్టి సారించాడు. అలా లాంగ్‌ జంప్‌లో శిక్షణ పొంది రాటుదేలాడు. 2016లో ఇటాలియన్‌ ఛాంపియన్‌షిప్‌ జరగ్గా అందులో 7.89 మీట్లర్లు దూకి విజయం సాధించాడు. ఆపై ఎన్నో విజయాలు సాదించాడు.

అనూహ్యంగా ట్రాక్‌పైకి:

అయితే 2018లో అనూహ్యంగా 100 మీటర్ల ట్రాక్‌పైకి వచ్చిన మార్సెల్‌ జాకబ్‌ సాధన చేయడం మొదలు పెట్టాడు. ఈలోగా కరోనా రావడంతో ఇంటి వద్దే సాధన చేయాల్సి వచ్చింది. మళ్లీ 2021లో సాధన మొదలు పెట్టిన జాకబ్స్‌.. యూరోపియన్‌ ఇండోర్‌ ఛాంపియన్స్‌లో 60 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించాడు. ఆ తర్వాత సవోనాలో 100 మీటర్లను 9.95 సెకన్లలో చేరుకుని సరికొత్త ఇటాలియన్‌ రికార్డు నమోదు చేశాడు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్‌ 2020లో గోల్డ్ గెలిచి రికార్డు సృష్టించాడు.

Story first published: Sunday, August 1, 2021, 21:40 [IST]
Other articles published on Aug 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X