తగ్గేదే లే: యుద్ధభూమి అయినా..క్రీడా క్షేత్రమైనా: ఆ రెండు రాష్ట్రాల వారిదే హవా

చండీగఢ్: క్రీడారంగంలో అత్యున్నతమైన ఈవెంట్‌గా భావించే ఒలింపిక్స్.. గడువు సమీపిస్తోంది. ఇంకో రోజు మిగిలి ఉందంతే. శుక్రవారం ఈ ప్రతిష్ఠాత్మకమైన స్పోర్ట్స్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. జపాన్ దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులను అనుమతించట్లేదు అక్కడి ప్రభుత్వం. ఒలింపిక్స్ స్పోర్ట్స్ విలేజ్‌లోనూ అత్యంత పకడ్బందీగా చర్యలు తీసుకుంది. భారత్ తరఫున 127 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొంటోన్నారు. తమ సపోర్టింగ్ టీమ్‌తో కలిసి వారందరూ టోక్యో స్పోర్ట్స్ విలేజ్‌కు చేరుకున్నారు.

ఖచ్చితంగా పతకాన్ని ఆశించే ఈవెంట్లలో..

ఖచ్చితంగా పతకాన్ని ఆశించే ఈవెంట్లలో..

టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, ఫెన్సింగ్, హాకీ, బాక్సింగ్, జావెలిన్ థ్రో, రేస్ వాక్, లాంగ్‌జంప్ ఇలా 18 ఈవెంట్లలో భారత్ పాల్గొనబోతోంది. బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హాకీ, టెన్నిస్ వంటి కొన్ని ఈవెంట్లలో ఖచ్చితంగా భారత్‌ పతకం సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ఇదివరకు బ్యాడ్మింటన్‌లో పీవీ సింధూ ఒలింపిక్ పతకాన్ని ముద్దాడిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా అదే విశ్వాసంతో ఆమె టోక్యోలో అడుగు పెట్టారు. ఖచ్చితంగా మెడల్‌ను సాధించే కేటగిరీ ఇది. దీనితో పాటు రెజ్లింగ్‌ విభాగంపైనా భారత్ ఆశలు పెట్టుకుంది. బాక్సింగ్‌పైనా అంచనాలు ఉన్నాయి.

ఆ రెండు రాష్ట్రాల అథ్లెట్లదే హవా..

ఆ రెండు రాష్ట్రాల అథ్లెట్లదే హవా..

కాగా- భారత్ పంపించిన అథ్లెటిక్ టీమ్‌లో 40 శాతం మంది హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారే ఉండటం ప్రాధాన్యను సంతరించుకుంది. దేశ జనాభాలో ఈ రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజల వాటా 4.4 శాతమే. దేశ జనాభాలో నామమాత్రమే అయినప్పటికీ- స్పోర్ట్స్ ఈవెంట్లలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటోన్నాయి ఈ రెండు రాష్ట్రాలు.

దేశ ప్రతిష్ఠను ప్రపంచం నలుమూలలా విస్తరింపజేసే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోన్నాయి. ఇప్పటికీ త్రివిధ దళాలలో పంజాబ్, హర్యానా పౌరులు పెద్ద సంఖ్యలో ఉంటోన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్.. వంటి దళాల్లో పంజాబ్, హర్యానా పౌరులు అధికం. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తలవంచని మొండి ధైర్యం వారి సొంతం.

The History Of Olympic Games | ఒలింపిక్ క్రీడలు దాని చరిత్ర | Oneindia Telugu
ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది?

ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది?

అలాంటి హవాను స్పోర్ట్స్ ఈవెంట్లలోనూ ప్రదర్శిస్తోన్నారు ఈ రెండు రాష్ట్రాల అథ్లెట్లు. పంజాబ్ జనాభాలో 19 శాతం వరకు అథ్లెట్లు ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. హర్యానా జనాభాలో 25 శాతం మంది క్రీడాకారులు, అథ్లెట్లు టోక్య విమానం ఎక్కారు.

హర్యానా నుంచి 19 మంది మంది మహిళా హాకీ ప్లేయర్లు, ఏడుమంది రెజ్లర్లు, నలుగురు చొప్పున బాక్సర్లు, షూటర్లు ఒలింపిక్స్‌లో పాల్గనబోతోన్నారు. 11 మంది హాకీ ఆటగాళ్లు, ఇద్దరు షూటర్లు, ముగ్గురు అథ్లెట్లు, ఇద్దరు మహిళా హాకీ ప్లేయర్లు పంజాబ్‌కు చెందిన వారు.

యూపీ నుంచీ

యూపీ నుంచీ

ఈ రెండు రాష్ట్రాల తరువాత తమిళనాడు ఉంది. తమిళనాడు నుంచి 11 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు. కేరళ, ఉత్తర ప్రదశ్‌ల నుంచి ఎనిమిది మంది క్రీడాకారులు భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. దేశ జనాభాలో 17 శాతం వరకు ఉన్న ఉత్తర ప్రదేశ్ నుంచి టోక్యో ఒలింపిక్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న క్రీడాకారుల్లో 6.3 శాతం మేర ఉంటోంది. తమిళనాడు నుంచి ముగ్గురు సెయిలర్లు, ఇద్దరు టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు పాల్గొంటోన్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, July 21, 2021, 15:01 [IST]
Other articles published on Jul 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X