న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics:నో ధూంధాం..నో ఢించక్ ఢించక్: సింపుల్‌గా ప్రారంభ వేడుకలు,అతిథులు వీరే..!!

Tokyo Olympics 2020: No grandeur in Opening ceremony,Know who is attending the grand event

ప్రపంచ స్థాయిలో జరిగే ఏ గేమ్స్‌ అయినా సరే వాటి ఓపెనింగ్ సెరెమొనీ చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తారు. దేశ విదేశాల నుంచి పలు రంగాల్లో రాణిస్తున్న వారితో స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. సెలబ్రిటీస్‌ తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటారు. పాటలతో మైమరిపిస్తారు. డ్యాన్సులతో ధూమ్ ధామ్ చేస్తారు. ఇక టోక్యోలో ప్రారంభం కానున్న ఒలింపిక్స్ కూడా అంతే గ్రాండ్‌గా ఓపెనింగ్ సెరెమొనీ నిర్వహిస్తారా అంటే అంత బొమ్మ కనపడటం లేదు. ఇందుకు కారణం కోవిడ్ ఆంక్షలు అమలులో ఉండటమే.

కరోనాతో ఇప్పటికే పలు మెగా టోర్నీలు వాయిదా పడగా మరికొన్ని ఏకంగా రద్దయ్యాయి. గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. ఇక ఒలింపిక్స్ ప్రారంభ సమయం ఆసన్నమైంది. ఈ సారి చాలా సింపుల్‌గా ఓపెనింగ్ సెరెమొనీని ప్లాన్ చేశారు ఒలింపిక్స్ నిర్వాహకులు. అంతా అనుకున్నట్లు పెద్ద పెద్ద బాణాసంచాలు ఉండవు, మ్యూజికల్ నైట్ ఉండదు.. సెలబ్రిటీల స్టెప్పులు అంతకంటే ఉండవు. ఒక లోప్రొఫైల్ ఈవెంట్‌గా ఈ మెగా టోర్నీ ఓపెనింగ్ సెరెమొనీని ప్లాన్ చేశారు. అయితే ఈ ప్రారంభ కార్యక్రమానికి మాత్రం పలు దేశాల నుంచి ఆహుతులు విచ్చేయనున్నారు. దాదాపుగా 15 దేశాల నుంచి అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నరు.

Tokyo olympics 2020: ఒలింపిక్ గ్రామంలో భారత బృందం..

మొత్తంగా 1000 మందిలోపు మాత్రమే అతిథులు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు నిర్వాహకులు. ఇక టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు నేషనల్ స్టేడియం వేదిక కానుంది. కరోనాను కట్టడి చేసే భాగంలోనే ప్రారంభ వేడుకకు తక్కువ మంది ఉండేలా చర్యలు తీసుకున్నట్లు జపాన్ ప్రభుత్వం చీఫ్ కేబినెట్ సెక్రటరీ కత్సునోబు కాటో క్యోడో న్యూస్ ఏజెన్సీకి వివరించారు.

The History Of Olympic Games | ఒలింపిక్ క్రీడలు దాని చరిత్ర | Oneindia Telugu

ఇక టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు తమ హాజరు తప్పనిసరిగా ఉంటుందని ఇప్పటికే పలువురు నేతలు చెప్పారు. వీరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, మంగోలియా ప్రధాని లవ్‌సన్నామ్‌స్రాయ్ ఓయూన్, ఎర్డీన్. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌లు హాజరు అవుతున్నారు. అయితే జపాన్‌లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలువురు దేశాధినేతలు తమ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. దీంతో టోక్యో ఒలింపిక్స్ గ్రాన్యూర్ కాస్త తగ్గినట్లు కనిపించింది.

ఇక ప్రేక్షకులు లేకుండానే పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌తో సంబంధం ఉన్న 67 మంది కరోనా బారిన పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రారంభ వేడుకల్లో అథ్లెట్స్‌ అందరికీ అనుమతివ్వలేదు. వారు కేవలం తమ గేమ్స్ ఉన్న రోజున హాజరై కాంపిటీషన్‌లో పాల్గొని ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి తమ గదులకు వెళ్లిపోతారని నిర్వాహకులు తెలిపారు. 2016 రియో ఒలింపిక్స్‌లో ప్రారంభ వేడుకలకు దాదాపుగా 12500 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. కానీ ఈ సారి పరిస్థితి మరోలా ఉండటంతో 1000 మందికంటే తక్కువగా ఉంటారని నిర్వాహకులు చెప్పారు.

Story first published: Wednesday, July 21, 2021, 16:36 [IST]
Other articles published on Jul 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X