న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్యాచారం.. సహజీవనం.. వివాహం.. ఒలింపిక్స్? (సౌమ్యజిత్ కథ)

Table tennis player Soumyajit Ghosh marries 18-year-old girl who accused him of rape

హైదరాబాద్: సౌమ్యజిత్‌ ఘోష్‌.. కొంతకాలం క్రితం భారత టీటీ అభిమానులకు క్రీడాకారుడిగానే తెలుసు. కానీ, కొద్ది నెలలుగా అత్యాచారం, సహజీవనం అలాంటి ఆరోపణలతో మీడియాలో కనిపిస్తూనే ఉన్నాడు. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న మీదట అతని కెరీర్ మళ్లీ టీటీకే అంకితం చేయాలని పూనుకున్నాడు. అతను దేశం తరపున రెండు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 58వ స్థానంలో నిలిచాడు.

అతలాకుతలం చేసిన అత్యాచార ఆరోపణ:

అతలాకుతలం చేసిన అత్యాచార ఆరోపణ:

భారత టీటీ రంగంలో మేటి ఆటగాడు దొరికాడనే ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. కానీ అంతలోనే అత్యాచార ఆరోపణ అతని జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. మానసికంగా దెబ్బతీసింది. ఇవన్నీ సమసిపోవాంటే ఆ ఆరోపణలు చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తలంచి నాలుగు నెలల తర్వాత ఆమెనే వివాహమాడాడు. చివరకు ఆ ఆరోపణలు చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు సౌమ్యజిత్‌.

కొన్ని రోజులు యూరోప్‌లోనే గడిపి

కొన్ని రోజులు యూరోప్‌లోనే గడిపి

గత మార్చిలో ఓ 18ఏళ్ల అమ్మాయి తనను అత్యాచారం చేశాడంటూ సౌమ్యజిత్‌పై కేసు పెట్టింది. జర్మనీలోని ఓ క్లబ్‌కు ఆడుతున్న సమయంలో అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. భారత్‌కు వస్తే అరెస్ట్‌ చేస్తారేమో అనే భయంతో అతను కొన్ని రోజులు యూరోప్‌లోనే గడిపి మేలో స్వదేశానికి చేరాడు. తిరిగి టీటీలో సత్తాచాటాలనే పట్టుదలతో ఉన్నాడు.

 డేటింగ్‌ మొదలెట్టినపుడు నా వయసు 22.

డేటింగ్‌ మొదలెట్టినపుడు నా వయసు 22.

‘భారత్‌లోని ఓ ఆటగాడు విజయాలు సాధించాలంటే చాలా కష్టపడాలని చెబుతుంటారు. కానీ నా జీవితంలో నాలుగు నెలల క్రితం జరిగిన ఓ సంఘటన అంతకంటే కష్టాలను అనుభవించేలా చేసింది. పూర్తిగా నన్ను అతలాకుతలం చేసింది. ఆ సంఘటన పట్ల ఎలా వ్యవహరించాలో కూడా నాకు తెలియలేదు. తనది చిన్న వయసంటూ అందరూ అమ్మాయి వైపే మాట్లాడుతున్నారు. ఆమె మైనర్‌ కావొచ్చు, కానీ మేం డేటింగ్‌ మొదలెట్టినపుడు నా వయసు 22. నేను కూడా చిన్నవాణ్నే. అలా అనుకుంటూ గతంలోనే బతకడం నాకిష్టం లేదు. భవిష్యత్‌ ముఖ్యం. తొందర్లోనే కేసు ఓ కొలిక్కి వచ్చి తిరిగి సాధన చేస్తానని అనుకుంటున్నా' అని సౌమ్యజిత్‌ తెలిపాడు.

ఒలింపిక్స్‌ ఆడడమే నా లక్ష్యం.

ఒలింపిక్స్‌ ఆడడమే నా లక్ష్యం.

‘ఆ సమయంలో నా నిజమైన శ్రేయోభిలాషులు ఎవరో నాకు తెలిసింది. నా కెరీర్‌ అత్యుత్తమ దశలో ఉండి జర్మనీలో ఓ మంచి క్లబ్‌ తరపున ఆడుతున్నపుడు ఇలా జరిగింది. ప్రస్తుతానికి మళ్లీ ఒలింపిక్స్‌ ఆడడమే నా లక్ష్యం. న్యాయపరమైన చిక్కులన్నింటినీ తొలగించుకోవాలి. బరువు కూడా పెరిగా. తిరిగి ఆడాలంటే చాలా కష్టపడాలని తెలుసు. తీవ్రంగా శ్రమిస్తా' అని అతను పేర్కొన్నాడు.

Story first published: Tuesday, August 7, 2018, 10:58 [IST]
Other articles published on Aug 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X