న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెదర్లాండ్స్‌తో రాత్రి 8 గంటలకు భారత హాకీ మ్యాచ్

By Nageswara Rao
India begins its campaign against the Netherlands
లండన్, జులై 30: ప్రపంచం మొత్తం ఎంతో ఘనంగా భావించే ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించిన భారత్‌ ప్రపంచ హాకీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నా... గత ఎనిమిది సంవత్సరాలలో జరిగిన రెండు ఒలింపిక్స్‌కు అర్హత కూడా సాధించలేకపోయింది. మళ్లీ భారత్ హాకీ జట్టు తన పూర్వవైభవాన్ని సాధించడంతో పాటు లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

ఐతే తిరిగి తన పూర్వ వైభవాన్ని నిలబెట్టుకుంటుందా.. లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్దకంగా మారింది. ఒలింపిక్స్‌లో భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు భరత్ చత్రి కెప్టెన్సీలో భారత హాకీ జట్టు పటిష్టమైన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించే విషయం ఎలాగున్నా తొలి మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో భారత్ జట్టు ఉంది. ప్రపంచ ర్యాకింగ్స్ భారత్ 10వ స్దానంలో ఉండగా.. నెదర్లాండ్స్ మూడో స్దానంలో ఉంది. లండన్ ఒలింపిక్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న ఆస్టేలియా, గత ఛాంపియన్ జర్మనీతో పాటు నెదర్లాండ్స్ టైటిల్ బరిలో ఉన్నాయి.

భారతదేశం స్వతంత్రం సాధించిన తొలినాళ్లలో జరిగిన లండన్‌ ఒలింపిక్స్‌ వేదికగా భారత్‌ హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. దీనికి తోడు వరుసగా 1996, 2000 సంవత్సరాలలో జరిగిన ఒలింపిక్స్‌లో కూడా భారత్‌కు స్వర్ణం దక్కింది. అయితే భారత్‌ పోటీలో లేని సమయంలో ఒక్కసారి మాత్రమే నెదర్లాండ్స్‌ పతకం సాధించుకుంది. అంతకు ముందు వరుసగా 1928 నుంచి 1956 వరకు స్వర్ణ పతకాన్ని సాధించుకున్న ఘనత కూడా భారత్‌దే. ఆ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా టైటిల్‌ ఫెవరెట్‌గా మారింది.

అయితే ఆస్ట్రేలియా కూడా ఆఖరు సారిగా టైటిల్‌ను దక్కించుకున్నది ఢిల్లీలో జరిగిన 2010 ప్రపంచ కప్‌గా చెప్పుకోవచ్చు. రికార్డులు ఎలా ఉన్నా.. ఎన్నో ఆశలతో లండన్‌ చేరుకున్న తమ జట్టు మాత్రం ఈ ఒలింపిక్స్‌లో పోరాట పటిమను కనబరుస్తుందని భారత హాకీ జట్టు కెప్టెన్‌ భరత్‌ ఛత్రీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తాము నామమాత్రానికి ఇక్కడకు రాలేదని, పకడ్బందీ వ్యూహంతో వచ్చామని, అందుకు తగ్గట్టుగానే మా ప్రదర్శన ఉంటుందని ఛత్రీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

హాకీ:
పరుషుల ప్లిలిమినరీ రౌండ్‌ గ్రూప్‌-బి
నెదర్లాండ్స్‌ భారత్‌
రాత్రి 8.00 నుంచి

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X