న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దక్షిణాసియా క్రీడల్లో ఎదురులేని భారత్‌.. ఒక్కరోజే 56 పతకాలు!!

South Asian Games: India wins 56 medals, consolidates top spot

ఖాట్మండు: దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులకు ఎదురులేకుండా పోయింది. స్విమ్మర్లు, ఉషు అథ్లెట్లు విశ్వరూపం ప్రదర్శించడంతో భారత్ గురువారం ఒక్క రోజే ఏకంగా 56 పతకాలను సొంతం చేసుకుంది. ఒకే రోజు 30 స్వర్ణాలు, 18 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 56 పతకాలు సొంతం చేసుకొని తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. గురువారం పోటీలు ముగిశాక భారత్‌ 62 స్వర్ణాలు, 41 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి 124 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

రోహిత్‌ ఫైర్: పోజులిచ్చింది చాలు.. కొంచెం బ్యాటింగ్‌పై కూడా దృష్టి పెట్టు!!రోహిత్‌ ఫైర్: పోజులిచ్చింది చాలు.. కొంచెం బ్యాటింగ్‌పై కూడా దృష్టి పెట్టు!!

గురువారం జరిగిన వుషు మహిళల పోటీల్లో శాంతనోయ్‌ దేవి (52 కేజీలు), పూనమ్‌ (75 కేజీలు), దీపిక (70 కేజీలు), సుశీల (65 కేజీలు), రోషిబినా దేవి (60 కేజీలు) స్వర్ణాలు సాధిస్తే.. పురుషుల విభాగంలో సునీల్‌ సింగ్‌, సూరజ్‌ సింగ్‌ పసిడి పతకాలతో మెరిశారు. స్విమ్మింగ్‌లో మొత్తం 11 పతకాలుగా రాగా.. అందులో నాలుగు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఓ కాంస్యం ఉంది. లిఖిత్‌ సెల్వరాజ్‌ (పురుషుల 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌), ఆపేక్ష (మహిళల 200 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌), దివ్య (మహిళల 100 మీ. బటర్‌ఫ్లయ్‌) బంగారు పతకాలు గెలిచారు.

వెయిట్‌లిఫ్టింగ్‌లో జిలిల్‌ దలబెహెరా (మహిళల 45 కేజీలు), స్నేహా (49 కేజీలు), వింధ్యారాణి దేవి (55 కేజీలు), సిద్ధాంత్‌ (పురుషుల 61 కేజీలు) స్వర్ణాలుసాయించారు. తైక్వాండోలో పూర్వ (49 కేజీలు), రుచిక (67 కేజీలు), మార్గరెట్‌ (73 కేజీలు) బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు.

భారత షట్లర్లు మరో రెండు స్వర్ణాలు ఖాయం చేశారు. మహిళల సింగిల్స్‌లో పుల్లెల గాయత్రి, అస్మిత చెలిహా ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు సిరిల్‌ వర్మ, ఆర్యమన్‌ టాండన్‌ మధ్య ఫైనల్‌ ఫైట్‌ జరగనుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌-జక్కంపూడి మేఘన జోడీ స్వర్ణ పోరుకు సిద్దమయింది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-మేఘన జక్కంపూడి జోడీ పరాజయం పాలైంది.

62 స్వర్ణాలు, 41 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి 124 పతకాలతో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఆతిథ్య దేశం నేపాల్‌ 36 స్వర్ణాలు, 27 రజతాలు, 38 కాంస్యాలతో కలిపి మొత్తం 101 పతకాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Friday, December 6, 2019, 8:29 [IST]
Other articles published on Dec 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X