న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gymnastic World Championship: చరిత్ర సృష్టించిన సిమోనా బైల్స్

Simone Biles Breaks Medals Record As Team USA Wins Gymnastic World Championship

హైదరాబాద్: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అమెరికా జిమ్మాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ చరిత్ర సృష్టించింది. బైల్స్‌ అద్భుత ప్రదర్శనతో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అమెరికా వరుసగా ఐదోసారి టీమ్‌ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. టీమ్‌ ఆల్‌రౌండ్‌ ఈవెంట్‌లో అమెరికా జట్టు 172.330 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది.

దీంతో బైల్స్‌ రికార్డు స్థాయిలో 15వ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. రష్యా, ఇటలీ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో బైల్స్‌కు ఇది 21వ స్వర్ణం కావడం విశేషం. దీంతో రష్యాకు చెందిన ఖొర్కినా (20)ను వెనక్కి నెట్టి అత్యధిక ప్రపంచ టైటిళ్లు నెగ్గిన క్రీడాకారిణిగా అరుదైన ఘనత సాధించింది.

ఆల్‌టైమ్‌ రికార్డుకు రెండు పతకాల దూరంలో

ఆల్‌టైమ్‌ రికార్డుకు రెండు పతకాల దూరంలో

అదే సమయంలో ఆల్‌టైమ్‌ రికార్డుకు(23) బైల్స్‌ కేవలం రెండు పతకాల దూరంలో ఉంది. పురుషుల జిమ్నాస్టిక్స్‌లో 23 పతకాలు గెలిచిన విటలీ షెర్బో(బెలార్‌స) పేరిట ఈ ఆల్‌టైమ్‌ రికార్డు ఉంది. ఇదిలా ఉంటే, పురుషుల టీమ్‌లో జిమ్నాస్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌‌ను రష్యా జట్టు గెలుచుకుంది. ఈ విభాగంలో స్వర్ణం నెగ్గడం రష్యాకు ఇదే మొదటిసారి.

రెండు రోజుల క్రితం ఫ్లోర్‌ ఈవెంట్‌లో

రెండు రోజుల క్రితం ఫ్లోర్‌ ఈవెంట్‌లో

కాగా, ఇదే ఛాంపియన్‌షిప్‌లో రెండు రోజుల క్రితం ఫ్లోర్‌ ఈవెంట్‌లో ట్రిపుల్‌ డబుల్‌ చేసి సిమోన్ బైల్స్ అరుదైన రికార్డు నెలకొల్పింది. సోమవారం వరల్డ్‌ ఆర్టిస్టిక్‌ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ మొదటి రోజే చూపరులను ఆకట్టుకుంది. గంటల వ్యవధిలో రెండు విన్యాసాలు చేసింది. ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ క్వాలిఫికేషన్‌లో బైల్స్‌.. ట్రిపుల్‌-డబుల్‌ స్కిల్‌ను ప్రదర్శించింది.

శరీరాన్ని రెండుసార్లు బ్యాక్‌ ఫ్లిప్‌ చేస్తూ

శరీరాన్ని రెండుసార్లు బ్యాక్‌ ఫ్లిప్‌ చేస్తూ

గాలిలోకి ఎగిరి కిందకు ల్యాండ్‌ అయ్యే క్రమంలో శరీరాన్ని రెండుసార్లు బ్యాక్‌ ఫ్లిప్‌ చేస్తూ మూడుసార్లు ట్విస్ట్‌ చేయడం. అత్యంత అరుదైన, సాహసోపేతమైన ఈ అద్భుత విన్యాసాన్ని బైల్స్‌ ఆవిష్కృతం చేసి చరిత్ర సృష్టించింది. ఈ విన్యాసానికి 'బైల్స్‌-2'అని పేరు పెట్టారు. ఆ తర్వాత బీమ్‌లో డబుల్‌-ట్విస్టింగ్‌ డబుల్‌ టక్‌ డిస్మౌంట్‌ను ప్రదర్శన సైతం బైల్స్ చేయడం విశేషం.

Story first published: Thursday, October 10, 2019, 8:26 [IST]
Other articles published on Oct 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X