న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'కనీసం తమ్ముడైనా రాణించాలని త్యాగం చేశా'

Premature baby to Asian Games champ: Family traces Amit Panghal’s path to glory

జకార్తా: భారత యువ బాక్సర్‌ అమిత్‌ పంఘాల్ ఆసియా క్రీడల్లో సంచలనం సృష్టించాడు. ఒలింపిక్‌ ఛాంపియన్‌ను ఓడించి భారత్‌కు స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టాడు. ఆసియా క్రీడల 49 కిలోల విభాగంలో ఒలింపిక్‌ ఛాంపియన్‌ హసన్‌బోయ్‌ దుస్మతోవ్‌ను 3-2తో విజయం సాధించి పసిడిని ముద్దాడాడు. అయితే, అమిత్‌ ఈ దశకు చేరుకోవడానికి జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. అతని క్రీడా పయనం అంతా సులువుగా ఏమీ సాగలేదు.

హరియాణాలో మైనా గ్రామంలో అజయ్‌, అమిత్‌..

హరియాణాలో మైనా గ్రామంలో అజయ్‌, అమిత్‌..

అమిత్ విజయాల వెనుక అతడి సోదరుడి త్యాగమే ప్రధానంగా కనిపిస్తుంది. బాక్సింగ్‌లో రాణిస్తున్న సమయంలో అతడి సోదరుడు అజయ్‌.. తమ్ముడు అమిత్‌ కోసం కెరీర్‌ను త్యాగం చేశాడు. వారిద్దరూ క్రీడల్లో ముందుకు సాగేందుకు వారి పేదరికం అడ్డుపడింది. 12 ఏళ్ల క్రితం అజయ్‌, అమిత్‌.. ఇద్దరూ హరియాణాలోని రోహ్‌తక్‌ సమీపంలోని మైనా గ్రామంలోని ప్రైవేట్‌ అకాడమీలో బాక్సింగ్‌ శిక్షణ కోసం చేరారు.

త్యాగం వృథాగా పోలేదని..అమిత్‌ స్వర్ణంతో:

త్యాగం వృథాగా పోలేదని..అమిత్‌ స్వర్ణంతో:

కొన్నాళ్లకు ఆర్థిక పరిస్థితుల కారణంగా బాక్సింగ్ ‌నుంచి అజయ్‌ తప్పుకున్నాడు. కుటుంబ పోషణ కోసం ఆర్మీలో చేరాడు. అనంతరం అమిత్‌ బాక్సింగ్‌ను కొనసాగించాడు. తన త్యాగం వృథాగా పోలేదని గతేడాది ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అమిత్‌ కాంస్యం గెలవడంతో తనకు ఎంతో సంతోషాన్నించిందని అజయ్‌ తెలిపాడు. తాజాగా ఆసియా క్రీడల్లో అమిత్‌ స్వర్ణం గెలిచి హీరోగా నిలవడంతో తన ఆనందానికి అవధులు లేవని చెబుతున్నాడు.

బాక్సింగ్‌ గ్లోవ్స్‌ కొనివ్వడానికి నాన్న వద్ద:

బాక్సింగ్‌ గ్లోవ్స్‌ కొనివ్వడానికి నాన్న వద్ద:

త్యాగానికి మంచి ప్రతిఫలం లభించిందని పేర్కొన్నాడు. ‘మా ఇద్దరికీ బాక్సింగ్‌ గ్లోవ్స్‌ కొనివ్వడానికి కూడా మా నాన్న వద్ద డబ్బులు ఉండేవి కావు. బాక్సింగ్‌లో రాణించాలంటే మంచి ఆహారం కూడా తీసుకోవాలి. అది ఖర్చుతో కూడుకున్నది. నా తమ్ముడైనా బాక్సింగ్‌లో రాణించాలని నేను త్యాగం చేశాను. ఆర్మీలో చేరాను' అని అజయ్‌ అనాటి రోజులను గుర్తుచేసుకున్నాడు.

2010 తర్వాత ఏషియాడ్‌లో స్వర్ణం:

2010 తర్వాత ఏషియాడ్‌లో స్వర్ణం:

తన తమ్ముడికి ఇదే విధంగా సహకారం అందిస్తానని, ప్రస్తుతం మా కుటుంబం స్వర్ణ పతక సంబరాల్లో ఉంది అంటూ అజయ్‌ పేర్కొన్నాడు. 22 ఏళ్ల అమిత్‌ కూడా సైన్యంలో పని చేస్తున్నాడు. అతడికివే తొలి ఆసియా క్రీడలు. 2010లో విజేందర్‌, వికాస్‌ల తర్వాత ఏషియాడ్‌లో స్వర్ణం గెలిచిన పురుష బాక్సర్‌ అమితే. ఈ క్రీడల్లో ఏకైక బాక్సింగ్‌ స్వర్ణం అతడిదే.

Story first published: Monday, September 3, 2018, 11:15 [IST]
Other articles published on Sep 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X