టైటాన్స్, బుల్స్ మ్యాచ్ టై: చరిత్ర సృష్టించిన రాహుల్ చౌదరి

Posted By:

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌, బెంగుళూరు బుల్స్‌ జట్ల మధ్య శనివారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌ 26-26తో టైగా ముగిసింది. మ్యాచ్‌లో చాలా భాగం వెనుకబడ్డ టైటాన్స్‌.. ఆఖరి ఐదు నిమిషాల్లో బలంగా పుంజుకుని ఓటమి నుంచి తప్పించుకుంది.

చరిత్ర సృష్టించిన రాహుల్ చౌదరి

చరిత్ర సృష్టించిన రాహుల్ చౌదరి

టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి ఎనిమిది రైడింగ్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రొకబడ్డీ లీగ్‌లో మొత్తంగా 600 రైడ్‌ పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా రాహుల్ చౌదరి చరిత్ర సృష్టించాడు. బెంగళూరు తరఫున రోహిత్‌ కుమార్‌ ఎనిమిది పాయింట్లు సాధించాడు.

నాలుగు సూపర్‌ టాకిల్స్‌ చేసిన తెలుగు టైటాన్స్

నాలుగు సూపర్‌ టాకిల్స్‌ చేసిన తెలుగు టైటాన్స్

ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు నాలుగు సూపర్‌ టాకిల్స్‌ చేసి మ్యాచ్‌ను చేజారకుండా చూసుకుంది. విశాల్‌ భరద్వాజ్‌ ఏడు టాకిల్‌ పాయింట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. తాజా టైతో తెలుగు టైటాన్స్ 17 మ్యాచ్‌ల్లో 33 పాయింట్లతో జోన్-బిలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

పట్నా పైరేట్స్ పై గెలిచిన యూపీ యోధా

పట్నా పైరేట్స్ పై గెలిచిన యూపీ యోధా

మరోవైపు బెంగళూరు బుల్స్ (32) ఐదో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ 45-42తో యూపీ యోధాపై గెలిచింది. పట్నా జట్టులో పరదీప్ నార్వల్ 15 పాయింట్లతో విజృంభించాడు.

ప్రో కబడ్డీలో ఆదివారం

ప్రో కబడ్డీలో ఆదివారం

జైపూర్‌ Vs ఢిల్లీ రాత్రి 8 గంటలకు
పట్నా Vs బెంగాల్‌ రాత్రి 9 గంటలకు
మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌2లో ప్రత్యక్ష ప్రసారం

Story first published: Sunday, September 17, 2017, 10:06 [IST]
Other articles published on Sep 17, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి