న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వర్ణంతో చరిత్ర సృష్టించిన పంకజ్ అద్వానీ

Pankaj Advani storms past Ju Reti to clinch gold in the Asian Tour Snooker Tour event

హైదరాబాద్: ఆసియా స్నూకర్‌ టూర్‌ రెండో అంచె టోర్నీ ఫైనల్లో భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ స్వర్ణ పతకం సాధించాడు. చైనాలోని జినాన్ వేదికగా బుధవారం జరిగిన పైనల్లో చైనా ఆటగాడు జు రెటిపై 6-1తేడాతో విజయం సాధించాడు.

<strong>కేరళ అందం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది: విరాట్ కోహ్లీ</strong>కేరళ అందం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది: విరాట్ కోహ్లీ

సెప్టెంబర్ నెలలో దోహా వేదికగా జరిగిన తొలి అంచె పోటీల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న పంకజ్ అద్వానీ ఇప్పుడు స్వర్ణం సాధించాడు. పంకజ్‌కు ఇది రెండో ఆసియా ఆసియా స్నూకర్‌ టైటిల్ కావడం విశేషం. 2003లో చైనా గడ్డపైనే తన తొలి ఆసియా స్నూకర్‌ టైటిల్‌ను పంకజ్ నెగ్గాడు.

మళ్లీ పదిహేనేళ్ల తర్వాత అదే చైనీస్ గడ్డపై ఇప్పుడు మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో పంకజ్ అద్వానీ తొలి అంచె నుంచీ అద్భుత విజయాలను సాధిస్తూ ఫైనల్‌కు చేరుకున్నాడు. మంగళవారం జరిగిన సెమీ పైనల్లో పంకజ్ అద్వానీ 93-0, 5-56, 62-58, 42-34, 37-23, 85-4తేడాతో పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ బిలాల్‌ను ఓడించాడు.

అంతకుముందు జరిగిన క్వార్టర్‌ఫైనల్లోనూ పంకజ్ 5-1తో ఆమిర్ సర్కోష్ (ఇరాన్)ను ఓడించాడు.

ఫైనల్ ఫలితాలు:
ఫైనల్: Pankaj Advani (India) beat Ju Reti (China) 6-1: 48-35, 67(40)-23, 24-69(60), 63-33, 100(49, 51)-0, 47-19, 94-0
సెమీ ఫైనల్: Pankaj Advani (India) beat Mohammed Bilal (Pakistan) 5-1: 93(93)-0, 5-56, 62(58)-1, 42(40)-34, 37-23, 85(84)-4;
క్వార్టర్ ఫైనల్: Pankaj Advani (India) defeated Amir Sarkhosh (Iran) 5-1: 53-18, 53-31, 15-60(47), 75(75)-0, 52-40, 80(80)-17.

Story first published: Wednesday, October 31, 2018, 18:02 [IST]
Other articles published on Oct 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X