బికినీలు వేసుకోలేద‌ని.. ఆ జట్టుకు భారీ జ‌రిమానా! ఇదెక్కడి విచిత్రమండి!

Norway Womens Beach Handball Team Fined 150 Euros For Wearing Shorts Rather Than Bikini Uniforms.

బ్రసెల్స్‌: నార్వే మహిళల హ్యాండ్​బాల్​ జట్టుకు భారీ షాక్ తగిలింది. మ్యాచ్ సందర్భంగా బికినీలు వేసుకోలేదని నార్వే మహిళల జట్టుకు యూరోపియన్​ హ్యాండ్​బాల్​ ఫెడరేషన్​ (ఈహెచ్‌ఎఫ్‌) భారీ జరిమానా విధించింది. బికినీలకు బదులు షార్ట్‌లు వేసుకుని బరిలోకి దిగినందుకు 1500 యూరోలు (రూ.1,31,710) ఫైన్ వేసినట్లు ఈహెచ్‌ఎఫ్‌ ప్రకటించింది. రూల్స్‌కు వ్యతిరేకంగా అనుమతి లేని దుస్తులు ధరించి మ్యాచ్‌ ఆడినందుకు డిసిప్లినరి యాక్షన్‌ కింద జరిమానా విధించినట్లు వెల్లడించింది. అంటే జట్టులోని పది మంది అథ్లెట్లు చెరో 150 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది.

IND vs CSXI: వాషింగ్టన్ సుందర్‌తో సిరాజ్ గొడవ.. ఒక పరుగుకే ఔట్! కౌంటీ ఎలెవన్‌ స్కోర్ 43/3!IND vs CSXI: వాషింగ్టన్ సుందర్‌తో సిరాజ్ గొడవ.. ఒక పరుగుకే ఔట్! కౌంటీ ఎలెవన్‌ స్కోర్ 43/3!

బికినీ స్థానంలో షార్ట్స్:

బల్గేరియాలోని వర్నాలో ఇటీవలే యూరోపియన్​ బీచ్​ హ్యాండ్​బాల్​ ఛాంపియన్​షిప్​ జరిగింది. టోర్నీలో భాగంగా స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్వే మహిళల హ్యాండ్​బాల్​ జట్టు.. రూల్స్​కు వ్యతిరేకంగా బికినీ స్థానంలో షార్ట్స్ ధరించి బరిలో దిగారు. దీంతో సదరు టీమ్​పై ఆగ్రహించిన యూరోపియన్​ హ్యాండ్​బాల్​ సమాఖ్య భారీ జరిమానా విధించింది. 1500 యూరోలు పరిహారంగా కట్టాలని ఆదేశించింది. భారత కరెన్సీలో ఒక లక్ష్య 31 వేలు. అంతర్జాతీయ హ్యాండ్​బాల్​ సమాఖ్య నిబంధనల ప్రకారం మహిళా అథ్లెట్లు తప్పనిసరిగా బాటమ్​ బికినీ ధరించాలి. సైడ్స్​లో బికినీ సైజ్​ నాలుగు అంగుళాలను మించకూడదు. అదే విధంగా పురుష అథ్లెట్లు మోకాలికి నాలుగు అంగుళాల పైకి షార్ట్స్​ వేసుకునే వెసులుబాటు ఉంది.

ప్లేయర్స్‌కు మద్దతుగా:

తమ జట్టు క్రీడాకారిణులు తీసుకున్న నిర్ణయాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు నార్వే హ్యాండ్​బాల్​ ఫెడరేషన్ ​(ఎన్​హెచ్​ఎఫ్​) సోషల్​మీడియాలో ప్రకటించింది. ఈ వివాదాస్పద నిబంధన గురించి 2006లో ఫిర్యాదు చేసి.. ఆ రూల్​ మార్చేందుకు తామెంతో కృషి చేస్తున్నట్లు తెలిపింది. అథ్లెట్లకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తులను ధరించడంలో తప్పేముందని, మార్పు తెచ్చేందుకే మహిళా అథ్లెట్లు ఆ నిర్ణయానికి వచ్చారని స్పష్టం చేసింది. ఈహెచ్‌ఎఫ్‌ అనవసర రాద్దాంతం చేస్తుందని పేర్కొంది. ఈ విషయంలో తాము ప్లేయర్స్‌కు మద్దతుగా నిలుస్తామని, అలాగే వారికి విధించిన జరిమానాను తామే చెల్లిస్తామని స్పష్టం చేసింది.

ఒలింపిక్స్‌లో ఓ క్రీడ:

ఒలింపిక్స్‌లో ఓ క్రీడ:

బీచ్ హ్యాండ్​బాల్​ కూడా ఒలింపిక్స్‌లో ఓ క్రీడ. జూన్ 23న టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ సారి చాలా సింపుల్‌గా ఓపెనింగ్ సెరెమొనీని ప్లాన్ చేశారు ఒలింపిక్స్ నిర్వాహకులు. అంతా అనుకున్నట్లు పెద్ద పెద్ద బాణాసంచాలు ఉండవు, మ్యూజికల్ నైట్ ఉండదు.. సెలబ్రిటీల స్టెప్పులు అంతకంటే ఉండవు. ఒక లోప్రొఫైల్ ఈవెంట్‌గా ఈ మెగా టోర్నీ ఓపెనింగ్ సెరెమొనీని ప్లాన్ చేశారు. అయితే ఈ ప్రారంభ కార్యక్రమానికి మాత్రం పలు దేశాల నుంచి ఆహుతులు విచ్చేయనున్నారు. దాదాపుగా 15 దేశాల నుంచి అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మొత్తంగా 1000 మందిలోపు మాత్రమే అతిథులు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు నిర్వాహకులు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, July 21, 2021, 19:25 [IST]
Other articles published on Jul 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X