న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డోప్ టెస్టులో ఫెయిల్: లీ చాంగ్ వీని సస్పెండ్ చేశారు?

By Nageswara Rao

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ నెంబర్‌వన్‌ లీ చాంగ్‌ వీ డోపింగ్‌ పరీక్షల్లో పట్టుపట్టాడు. ఈఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో లీ చాంగ్‌ వీ నిషిద్ధ ఉత్పేరకాన్ని వాడినట్లు పరీక్షల్లో స్పష్టమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ డోపింగ్‌ ప్యానల్‌ ఎదుట విచారణకు గైర్హాజరైన లీ చాంగ్‌ వీ రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొననున్నాడు.

లీ చాంగ్‌ వీ ఏ శాంపిల్‌లో డోపీగా తేలినట్లు ఇదివరకే కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా నార్వేలో నిర్వహించిన బి-శాంపిల్‌ పరీక్షల్లోనూ పాజిటివ్‌గా తేలటంతో అతడిని డోపీగా అధికారికంగా ప్రకటించారు.

No. 1 Lee Chong Wei fails doping test

నవంబర్‌ 5న నార్వేలోని నిర్వహించిన బి-శాంపిల్‌ పరీక్షలో లీ చాంగ్‌ వీ పాజిటివ్‌గా కనుగొన్నట్లు మలేసియా బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు నోర్జా జకారియా చెప్పాడు. బి శాంపిల్ లోనూ నిషిధ్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో ఓ ఆటగాణ్ణి సస్పెండ్ చేసినట్లు ప్రకటించాడు.

ప్రాథమిక డోప్ పరీక్షల్లో నిషిధ్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తెలడంతో బి నమూనా ఇవ్వడానికి లీ నార్వే వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. లీచాంగ్‌ వీ వాడినట్లుగా చెబుతున్న 'డెక్సామెథాసోన్‌' క్రీడాకారుని సామర్థ్యాని పెంచేందుకు ఏవిధంగానూ ఉపయోగపడదని జకారియా అన్నారు.

ఈవిషయంలో మేము లీ చాంగ్‌ వీ వెన్నంట ఉంటాం. అతడు అమాయకుడు, విజయానికి దగ్గరి దారి కోసం చాంగ్‌ వెతకడు అని జకారియా చెప్పారు. వరల్డ్‌ నెం.1గా కొనసాగుతున్న లీ..రెండు ఒలింపిక్‌ రజతాలు, నాలుగు కామన్వెల్త్‌ స్వర్ణాలు సహా రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X