న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని గెలిచిన కాంచనమాల

Nagpur's Kanchanmala becomes first Indian to win gold at World Para Swimming Championship

హైదరాబాద్ : అంధత్వం అడ్డురాలేదు. ఏదో ఓ పతకంతో సరిపెట్టుకోలేదు. స్వర్ణాన్ని గెలిచింది. ప్రపంచ స్థాయిలో పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని తెచ్చి పెట్టింది. ఇవన్నీ చేసింది ఎవరా అనుకుంటున్నారా.. కాంచనమాల. మహారాష్ట్రలోని అమరావతి వాసి. గురువారం మెక్సికోలో నిర్వహించిన ప్రపంచ స్థాయి పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీ ప్రపంచ స్థాయి విజేతగా నిలిచిన కాంచనమాల విజయగాథ ఆమె మాటల్లో..

'ఈ పోటీల నిమిత్తం నేను చాలా కష్టపడ్డాను. ఖచ్చితంగా గెలుస్తానని అనుకున్నా. కానీ, స్వర్ణాన్ని గెలుస్తాననుకోలేదు. ఈ విజయం గురించి మాట్లాడాలంటే మాటలు రావడం లేదు. నేను ఇంత బాగా రాణించగలగడానికి ప్రోత్సాహం అందించింది మా ఆయన వినోద్ దేశ్‌ముఖ్ ముఖ్య కారణం'. అని వివరించింది.

బెర్లిన్ లో జరిగిన టాప్ పారా అథ్లెట్స్‌తో తలపడి 100మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో (1:34:00) సాధించింది. ఇంతేగాక, 100మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో (1:41:00), 100మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో (2:01:00)లకు పూర్తి చేసింది.
200 మీటర్ల మిడ్లే ఎస్‌ఎమ్‌11 ఈవెంట్‌ ఫైనల్స్‌లో భారత్‌కు చెందిన కాంచనమాల పాండే పసిడి పతకాన్ని దక్కించుకుంది. ప్రపంచ పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇప్పటి వరకు స్వర్ణపతకం దక్కలేదు. ఇప్పుడు పాండే పసిడి గెలిచి ఆ లోటును తీర్చింది. ఆర్‌బీఐలో విధులు నిర్వహిస్తోన్న పాండే అంధురాలు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 9, 2017, 11:48 [IST]
Other articles published on Dec 9, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X