న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ కప్ వివాదం! అధ్యక్షుడి బదులు విజేతకు ట్రోఫీ ఇవ్వనున్న శ్రీనివాసన్

By Srinivas

మెల్బోర్న్: 2015 ఐసీసీ ప్రపంచ కప్ ట్రోఫీని విజేతలకు ఐసీసీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఫైనల్లో ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి.

ఫైనల్లో గెలుపొందిన విజేతకు ఎన్ శ్రీనివాసన్ ట్రోఫీ ఇస్తారని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఐసీసీ నిబంధనకు విరుద్ధమని అంటున్నారు. అయితే, శ్రీనివాసన్ ఇచ్చేందుకు కూడా కారణాలున్నాయని చెబుతున్నారు.

సమాచారం మేరకు.. ఐసీసీ నిబంధనల ప్రకారం ఐసీసీ అధ్యక్షుడు విజేతలకు ట్రోఫీ ఇవ్వాలి. ప్రస్తుతం ఐసీసీ అధ్యక్షుడిగా ముస్తఫా కమాల్ (బంగ్లాదేశ్) ఉన్నారు. అతను ఇవ్వాల్సి ఉంది.

N Srinivasan to give away World Cup trophy, Kamal sidelined: reports

కానీ, సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ - భారత్ మ్యాచ్ సందర్బంగా వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. అంపైర్ తప్పిదం వల్ల బంగ్లాదేశ్ ఒడిందని సాక్షాత్తు బంగ్లా ప్రధాని వ్యాఖ్యానించారు. దీని పైన ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న ముస్తఫా కూడా స్పందించారు. తాను బంగ్లా అభఇమానిగా మాట్లాడుతున్నానని కూడా చెప్పారు.

ఈ వివాదం నేపథ్యంలో ముస్తఫాకు బదులు ఎన్ శ్రీనివాసన్ ట్రోఫీ అందజేయనున్నారని తెలుస్తోంది. 2011లో అప్పటి ఐసీసీ అధ్యక్షులు అప్పుడు గెలుపొందిన భారత జట్టుకు ట్రోఫీ అందజేశారు.

కాగా, ట్రోఫీ విషయమై ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్, ప్రెసిడెంట్ ముస్తఫా కమాల్‌ల మధ్య వాగ్వాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రోటోకాల్ ప్రకారం తానే ట్రోఫీని అందించాలని కమాల్ పట్టుబట్టాడని తెలుస్తోంది. కానీ శ్రీనివాసన్ విజేతకు ట్రోఫీ ఇవ్వనున్నారని సమాచారం. ముస్తఫా కమాల్ బంగ్లాదేశ్ రాజకీయ నాయకుడు కూడా. ఆయన బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ నేత.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X