న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రీడా స్ఫూర్తికే విరుద్దం.. ఫలితంగా జీవిత కాల నిషేదం

MOTORCYCLE RACER FACES LIFETIME BAN AFTER GRABBING RIVALS BRAKE AT 140 MPH

హైదరాబాద్: గెలవాలనే తపన, పట్టుదల ఉండొచ్చు. కానీ, తాను గెలవడం కోసం ప్రత్యర్థిని మోసం చేయడం క్రీడా స్ఫూర్తికే విరుద్ధం. అనివార్యంగా ప్రవర్తించాల్సిన క్రమశిక్షణను విస్మరించి.. గెలుపు కోసం అడ్డదారులు తొక్కితే అందుకు తగిన మూల్యం భారీగానే ఉంటుంది. ఇలానే ఒక రేసర్‌ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యహరించి జీవితకాలం నిషేధానికి గురయ్యాడు.

క్రీడా స్ఫూర్తిని చాటిన ఇరాన్ ప్లేయర్.. ప్రత్యర్థిని ఎత్తుకుని కోచ్ వరకూ..!క్రీడా స్ఫూర్తిని చాటిన ఇరాన్ ప్లేయర్.. ప్రత్యర్థిని ఎత్తుకుని కోచ్ వరకూ..!

ఇటలీలోని సాన్‌ మారినోలో నిర్వహించిన ఒక బైక్ రేస్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఇది బైక్ రేసులకే సవాల్‌గా పరిణమించింది. ఈ బైక్ రేసులో ఒక రైడర్ తన ప్రత్యర్థిని ఓడించేందుకు అతని బైక్ హ్యాండ్‌ బ్రేక్‌ను నొక్కేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ బైక్ 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.

కొద్దిగా పట్టుతప్పినా పెద్ద ప్రమాదమే జరిగివుండేది. 'ఇటాలియన్ మోటో జిపీ-2'కు చెందిన రొమానే ఫెనటీ... జాన్ మెరీనోరైడ్ సందర్భంలో ప్రత్యర్థి స్టెఫానో మంజీ బైక్ బ్రేక్‌ను ఒత్తి అతనిని పడవేసేందుకు ప్రయత్నించాడు. ఈ వ్యవహారం కారణంగా అతను రేసింగ్ గేమ్ ఆడకుండా జీవితకాలం నిషేధానికి గురయ్యాడు. ఈ ఘటన జరిగిన వెంటనే ఫెనాటీని ఈ రేస్ నుంచి తప్పించారు. అలాగే రేసింగ్ గేమ్ నిర్వాహకులు... ఫెనాటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఫెనాటీ అనుచిత ప్రవర్తన ఇది తొలిసారేం కాదు. అంతకుముందు జరిగిన పోటీలో ఓసారి ప్రత్యర్థి బైక్‌ని కాలితో తన్ని ఓ సారి దొరికిపోయాడు. రేసులో అనుచితంగా ప్రవర్తించడం.. ఆ తర్వాత క్షమాపణలు అడగడం అతనికి పరిపాటే. ఫెనాటీ రేసులో పాల్గొనడంపై బృందం తాలుకూ యజమాని 'ఇది చాలా చెత్త ప్రదర్శన. అతనిని మళ్లీ పోటీలోకి తీసుకోకుండా చూసుకుంటాను' అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Story first published: Tuesday, September 11, 2018, 12:10 [IST]
Other articles published on Sep 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X