న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Championship: మణికట్టు గాయంతోనూ అదరగొట్టిన మీరాబాయి చాను.. జస్ట్ 6 కేజీల తేడాతో స్వర్ణం మిస్..!

Mirabai Chanu wins Silver medal despite wrist injury

క్రీడాకారులకు గాయాలు సహజం. కానీ గాయం అని తెలియగానే వారికి విశ్రాంతి ఇచ్చేస్తుంటారు. కానీ గాయమైనా సరే దేశం కోసం శ్రమించింది వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని ప్రపంచ ఛాంపియన్‌కు ముచ్చెమటలు పట్టించింది. ఈ టోర్నమెంట్‌లో ఓవరాల్‌గా 200 కేజీలు లిఫ్ట్ చేసిన ఆమె.. సిల్వర్ మెడల్ సాధించింది. అగ్రస్థానంలో నిలిచిన చైనా వెయిట్ లిఫ్టర్ జియాంగ్ హూహువా 206 కేజీలతో స్వర్ణం సాధించింది. వీళ్లిద్దరి మధ్య తేడా కేవలం ఆరు కేజీలే కావడం గమనార్హం.

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 49 కేజీల విభాగంలో పోటీ పడిన చాను.. స్నాచ్‌లో 87 కేజీలు ఎత్తింది. ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 113 కేజీల బరువు ఎత్తడంతో మొత్తం 200 కేజీలకు చేరింది. టోక్యో ఒలింపిక్ ఛాంపియన్, చైనా వెయిట్ లిఫ్టర్ హో జీహువా 198 కేజీలతో మూడో స్థానంలో నిలిచింది.

పోటీల అనంతరం మీరాబాయి చాను కోచ్ విజయ్ శర్మ మాట్లాడుతూ.. సెప్టెంబరులో ప్రాక్టీస్ సమయంలో చాను మణికట్టుకు గాయమైందని వెల్లడించాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు చాను పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. వెయిట్ లిఫ్టర్లకు మణికట్టు ఎంత కీలకమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

అక్టోబరులో జరిగిన నేషనల్ గేమ్స్‌లో కూడా ఆ నొప్పితోనే చాను పోటీ పడిందని చెప్పిన విజయ్ శర్మ.. 'మాకు ఈ ఈవెంట్ వల్ల ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ బరువును మీరా రెగ్యులర్‌గా లిఫ్ట్ చేస్తుంది. ఇప్పటి నుంచి ఆమె ఎత్తే బరువును నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తాం.

మణికట్టు గాయం విషయంలో మేం ఏం చేయలేకపోయాం. ఎందుకంటే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను వదులుకోవాలని మేం అనుకోలేదు. మేం పాల్గొనే తర్వాతి పోటీలకు చాలా సమయం ఉంది కాబట్టి.. ఇప్పటి నుంచి ఈ గాయంపై కూడా ఫోకస్ పెట్టి జాగ్రత్తలు తీసుకుంటాం' అని పేర్కొన్నాడు.

Story first published: Wednesday, December 7, 2022, 12:35 [IST]
Other articles published on Dec 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X