న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెస్ టోర్నీ మధ్యలో పెళ్లి ప్రపోజల్: హిందీ అబ్బాయి, స్పానిష్ అమ్మాయి (వీడియో)

 Indian journalist proposes to Colombian chess star in the middle of a tournament

హైదరాబాద్: ప్రేమకు బౌండరీలు లేవు. కులం, మతం, భాష, సరిహద్దులతో సంబంధమే లేద. కేవలం రెండు మనసులు కలిస్తే చాలని మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే హిందీ మాట్లాడే ఓ అబ్బాయి... స్పానిష్ మాట్లాడే ఓ అమ్మాయికి టోర్నమెంట్ మధ్యలో తన పెళ్లిని ప్రపోజ్ చేశాడు.

ఇది జడేజా ప్రత్యకత: టైగా ముగిసిన గత రెండు మ్యాచ్‌ల్లో ఆఖరి బంతిని ఆడాడుఇది జడేజా ప్రత్యకత: టైగా ముగిసిన గత రెండు మ్యాచ్‌ల్లో ఆఖరి బంతిని ఆడాడు

2018 చెస్‌ ఒలంపియాడ్‌ టోర్నీ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. భారతకు చెందిన జర్నలిస్ట్‌ నిక్లేష్‌ జైన్‌, కొలంబియాకు చెందిన చెస్ క్రీడాకారిణి విమ్‌ ఎంజెలా లోపెజ్‌ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్‌ చేశాడు. టీమ్‌మ్యాచ్‌ మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుందనగా తన మనసులోని మాటను బయటపెట్టాడు.

ఎంజెలాతో పాటు అక్కడున్నవారంతా ఆశ్చర్యం

ఎంజెలాతో పాటు అక్కడున్నవారంతా ఆశ్చర్యం

దీంతో ఎంజెలాతో పాటు అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. టోర్నమెంట్‌లో భాగంగా కొలంబియాకు చెందిన చెస్ క్రీడాకారిణి విమ్‌ ఎంజెలా లోపెజ్‌ తన టీమ్ మ్యాచ్‌లో భాగంగా చైనాతో తలపడేందుకు సిద్ధమవుతుంది. ఈ సమయంలో భారత జర్నలిస్ట్ నిక్లేష్‌ జైన్ తన పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు.

నిక్లేష్‌ జైన్ మోకాళ్లపై కూర్చోని మరి

నిక్లేష్‌ జైన్ మోకాళ్లపై కూర్చోని మరి

నిక్లేష్‌ జైన్ మోకాళ్లపై కూర్చోని మరి రింగ్‌ను బహుమతిగా ఇస్తూ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా' అని ఎంజెలాకు హిందీలో ప్రపోజ్‌ చేయడం ఎంజెలాతో పాటు అక్కడున్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది. తన ప్రపోజల్‌కు ముగ్దురాలైన ఎంజెలా అతన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది.

కారణాన్ని వెల్లడించిన నిక్లేష్ జైన్

కారణాన్ని వెల్లడించిన నిక్లేష్ జైన్

అయితే, తాను అలా ప్రపోజ్ చేయడానికి గల కారణాన్ని సైతం నిక్లేష్ జైన్ వెల్లడించాడు. ఈ సందర్భంగా నిక్లేష్ జైన్ మాట్లాడుతూ "వాస్తవానికి ఆమెలా నేను ఓ చెస్‌ ప్లేయర్‌. గతంలోనే తనముందు పెళ్లి ప్రస్తావన తేవాలనుకున్నాను. కానీ చెస్‌ ఒలింపియాడే సరైనదని భావించాను. ఈ టోర్నీలో 189 దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇది మా ఇద్దరికి దేవాలయం వంటిది. అందుకే ఇక్కడ ప్రపోజ్‌ చేయాలని నిర్ణియించుకొని.. తన చెల్లి సాయం తీసుకున్నాను. గతేడాదిన్నరగా మేం ప్రేమించుకుంటున్నాం. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రధాన సమస్య భాష. ఆమె స్పానిష్‌ తప్ప ఇంగ్లీష్‌ మాట్లాడలేదు. మొబైల్‌ ట్రాన్స్‌లెట్‌ యాప్‌ సాయంతో మాట్లాడుకునేవాళ్లం" అని చెప్పాడు.

అమెరికా చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ సుసాన్‌ పొల్గర్‌

అమెరికా చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ సుసాన్‌ పొల్గర్ "అతను హిందీ మాట్లాడుతాడు(భారత్‌).. ఆమె స్పానిష్‌ మాట్లాడుతుంది(కొలంబియా). ఈ ఇద్దరిని చెస్‌ ప్రేమలో పడేసింది. 2018 చెస్‌ ఒలంపియాడ్‌ టోర్నీ సందర్భంగా ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. అతని ప్రపోజల్‌కు ఆమె అంగీకరించింది. వారిప్పుడు ఇంగ్లీష్‌ నేర్చుకుంటున్నారు. అభినందనలు.. ఇది ఒలంపియాడ్‌ లవ్‌" అంటూ ట్వీట్‌ చేసింది.

Story first published: Wednesday, September 26, 2018, 19:10 [IST]
Other articles published on Sep 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X