న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Atanu Das: భారత్ అద్భుత రికార్డ్: ఫోర్ టైమ్స్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్‌పై ఘన విజయం

Indias Archer Atanu Das beats Koreas Jin-Hyek 6-5 in mens individual 1/16 eliminations

టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో ఏడో రోజు భారత్ కొన్ని అనూహ్య విజయాలను అందుకుంది. శుభారంభం చేసింది. విజయంతో తన పతకాల వేటను ప్రారంభించింది. హాకీ, బ్యాడ్మింటన్‌లో ముందడుగు పడగా.. అర్చరీలోనూ అదే తరహాలో గెలుపును రుచి చూసింది భారత్. అత్యంత సంక్లిష్టమైన 1/16 ఎలిమినేషన్ రౌండ్‌లో.. అంతే కఠినమైన ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. అర్చరీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న దక్షిణ కొరియాకు చెందిన జిన్-హయెక్‌పై చిరస్మరణీయమైన విక్టరీని నమోదు చేసింది.

బలమైన అర్జెంటీనాను మట్టికరిపించి..: హాకీ ఇండియా ఖాతాలో మరో విజయంబలమైన అర్జెంటీనాను మట్టికరిపించి..: హాకీ ఇండియా ఖాతాలో మరో విజయం

నాలుగు సార్లు గోల్డ్ మెడలిస్ట్‌పై ఘన విజయం..

నాలుగు సార్లు గోల్డ్ మెడలిస్ట్‌పై ఘన విజయం..

జిన్-హయెక్.. ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ కూడా. అర్చరీలో నాలుగు సార్లు అతను స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, హాకీ ఇండియా.. సాధించిన విజయాల పరంపరను భారత అర్చర్ అతాను దాస్ కొనసాగించాడు. ఎలిమినేషన్ రౌండ్‌లో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్‌కు చుక్కలు చూపాడు. 6-5 పాయింట్ల తేడాతో ముందడుగు వేశాడు. ఈ ఉదయం పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్‌లో తన ప్రత్యర్థి చైనీస్ తైపే అర్చర్ డెంగ్ యు-ఛెంగ్‌ను 6-4 తేడాతో ఓడించాడు.

 విజయంతో ఆరంభం..

విజయంతో ఆరంభం..

అనంతరం 1/16 ఎలిమినేషన్ రౌండ్‌లో తనకంటే బలమైన ప్రత్యర్థి.. వరల్డ్ నంబర్ 3 ర్యాంకర్‌ జిన్-హయెక్‌ను ఢీ కొట్టాడు. ఇదివరకు హయెక్‌కు నాలుగు సార్లు ఒలింపిక్స్ ఛాంపియన్‌గా ఆవిర్భవించిన అనుభవం ఉంది. అన్ని విధాలుగా జిన్-హయెక్.. అతాను దాస్ కంటే మెరుగైన స్థితిలో ఉండటంతో విజయంపై పెద్దగా ఆశల్లేవు. జిన్-హయెక్‌కు గట్టిపోటీ ఇస్తే చాలని ఆశించారు. వాటన్నింటినీ తలకిందులు చేశాడు అతాను దాస్. అనూహ్య ఫలితాన్ని సాధించాడు. తొలి సెట్‌లో అతాను దాస్ 8,8,9 స్కోర్‌తో మొత్తం 25 పాయింట్ల సాధించాడు.

అన్ని సెట్లలోనూ ఆధిపత్యం..

అన్ని సెట్లలోనూ ఆధిపత్యం..

ఈ సెట్‌లో జిన్ హయెక్ ఆధిక్యాన్ని కనపరిచాడు. 8,9,9 స్కోర్‌తో 26 పాయింట్లు అందుకున్నాడు. రెండో సెట్‌లో అతాను దాస్-జిన్ హయెక్ చెరే 27 పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచాడు. ఈ సెట్‌‌లో అతాను దాస్ 9,9,9, స్కోర్‌తో మొత్తం 27 పాయింట్లు సాధించగా.. జిన్ హయెక్ 9,10,8తో 27 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడో సెట్‌లోనూ హోరాహోరి పోరు కొనసాగింది. అతాను దాస్, జిన్ హయెక్ 27 పాయింట్లను సాధించారు. 9,9,9తో అతాను దాస్ 27 పాయింట్లు, 8,10,9తో జిన్ 27 పాయింట్లను అందుకున్నాడు.

Karate to debut at the 2020 Tokyo Olympics
 షూట్ ఆఫ్‌లో ఫైర్..

షూట్ ఆఫ్‌లో ఫైర్..

నాలుగో సెట్‌లో అతాను విజృంభణను కొనసాగించాడు. 8,9,10 స్కోర్‌తో 27 పాయింట్లతో నిలవగా.. జిన్ తడబడ్డాడు. 9,7,6తో 22 పాయింట్లను మాత్రమే ఆర్జించగలిగాడు. అయిదో సెట్‌లో ఇద్దరూ మళ్లీ దూకుడును కొనసాగించారు. అతాను దాస్ 10,9,9తో 28 పాయింట్లు, 10,9,9, స్కోర్‌తో జిన్ 28 పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచారు. ఆరో సెట్ షూట్ ఆఫ్‌లో అతాను రెచ్చిపోయాడు. 10కి10 పాయింట్లు సాధించాడు. ఇక్కడ జిన్ వెనుకంజ వేశాడు. 9 పాయింట్లు మాత్రమే సాధించడంతో అతాను విజయం సాధించినట్లు కమిటీ ప్రకటించింది.

Story first published: Thursday, July 29, 2021, 9:36 [IST]
Other articles published on Jul 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X