న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జనగనమణ ఆలపిస్తూ కన్నీరుపెట్టిన హిమదాస్: మోడీ వీడియో ట్వీట్ వైరల్

By Nageshwara Rao
Hima Das: Golden run at IAAF event hailed by Narendra Modi, Sachin Tendulkar and Amitabh Bachchan

హైదరాబాద్: వరల్డ్ అండర్‌-20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌లో రికార్డ్‌ టైమింగ్‌తో భారత అథ్లెట్‌ హిమ దాస్‌ స్వర్ణ పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మెడల్‌ను అందుకున్న సమయంలో భావోద్వేగానికి లోనైంది. మెడల్ ప్రధానోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమ దాస్ ఆనందభాష్పాలను రాల్చింది.

జణగణమణ వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ తన ట్విట్టర్‌లో వీడియోని పోస్టు చేసి స్పందించారు. "హిమ దాస్‌ విజయం మరిచిపోలేని క్షణాలు. రేసులో నెగ్గిన వెంటనే జాతీయ పతాకం కోసం ఆమె అన్వేషిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆపై విజేతగా నిలిచిన హిమ దాస్‌ మన జాతీయ గీతాన్ని పాడటం మనసును కరిగించింది. ఈ వీడియో చూసిన భారతీయులెవ్వరూ సంతోషంతో కంటతడి పెట్టకుండా ఉండలేరంటూ" ట్వీట్ చేశారు.

ఫిన్లాండ్‌లోని టాంపెరె వేదికగా జరుగుతున్న ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగులో ఆమె 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం సాధించింది. ఐఏఏఎఫ్‌ వరల్డ్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌ హిమ దాసే కావడం విశేషం. అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ దాస్ తన తాజా ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారు.

దీంతో ఆమెపై సోషల్ మీడియా వేదిక ప్రశంసల వర్షం కురుస్తోంది. మహాంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహాంద్రా సైతం హిమాదాస్ ప్రదర్శనపై ట్విట్టర్‌లో స్పందించారు. "ఇది మిమ్మల్ని కదిలించకపోతే, ఇక ఏదీ మిమ్మల్ని కదిలించలేదు" అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా హిమదాస్ చరిత్ర సృష్టించింది.

మరోవైపు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ ద్వారా హిమాదాస్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. "హిమాదాస్ గొప్ప ఘ‌న‌త సాధించింది. భారత క్రీడల చరిత్రలో చెప్పుకోద‌గ్గ క్ష‌ణం ఇది. మిమ్మ‌ల్ని చూసి గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను . మీకు నా అభినంద‌న‌లుఠ అని త‌న ట్వీట్ చేశారు.

ఇక, జూనియర్ ఎన్టీఆర్ సైతం హిమదాస్‌కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. "కొత్త చ‌రిత్ర సృష్టించిన హిమ‌దాస్‌కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో స్వ‌ర్ణం నెగ్గిన అథ్లెట్‌గా నిలిచారు. ఇది గొప్ప సంతోష‌క‌ర స‌మ‌యం" అని ట్వీట్ చేశాడు.

మరోవైపు రామ్ ఛరణ్ సైతం తన ఫేస్‌‌బుక్‌లో "మ‌మ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేశారు. ప్ర‌పంచ జూనియ‌ర్ చాంపియ‌న్ షిప్‌లో ఫీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన తొలి భార‌తీయురాలు హిమ‌దాస్‌. దేశం యావ‌త్తు మీకు సెల్యూట్ చేస్తోంది" అని పోస్టు చేశాడు.

Story first published: Saturday, July 14, 2018, 13:35 [IST]
Other articles published on Jul 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X