రికార్డు ధర పలికిన అమెరికా మాజీ బాస్కెట్ బాల్ ఛాంపియన్ మైఖేల్ జోర్డాన్ జెర్సీ.. ఏకంగా అన్ని కోట్లు

ప్రఖ్యాత అమెరికా మాజీ బాస్కెట్‌బాల్ ఛాంపియన్ మైఖేల్ జోర్డాన్ 1998 NBA ఫైనల్స్‌ గేమ్ 1లో ధరించిన జెర్సీ వేలంలో 10.1మిలియన్ల డాలర్ల భారీ ధరకు అమ్ముడుపోయింది. భారత కరెన్సీలో ఈ విలువ సుమారు 80కోట్ల వరకు ఉంటుంది. ఏ గేమ్ పరంగా చూసుకున్న అత్యంత రికార్డ్ వేలం ఇదేనని హౌస్ సోథెబీస్ ప్రకటించింది. 23నంబర్ కలిగిన ఈ రెడ్ జెర్సీకి 20వేర్వేరు బిడ్‌లు వచ్చాయని వేలందారు సంస్థ సోథెబీస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 5మిలియన్ల డాలర్ల మేర ధర పలకవచ్చని సంస్థ అంచనా కట్టింది. అయితే అనుకున్నదాని కంటే రెట్టింపు మేర వేలంలో ధర పలికి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ జెర్సీ జోర్డాన్ మెమోరాబిలియాలో ఇప్పటివరకు విక్రయించబడిన అత్యంత విలువైన వస్తువుగా నిలిచింది.

'జోర్డాన్ కెరీర్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన సీజన్‌ 1998. ఆ సీజన్లో జోర్డాన్ రెడ్ 23జెర్సీని ధరించారు, బాస్కెట్ బాల్‌లో సూపర్ స్టార్‌గా ఎదిగిన జోర్డాన్ ఎప్పటికప్పుడు గొప్ప బాస్కెట్‌బాల్ ఆటగాడిగా తన వారసత్వాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్( NBA) ఫైనల్స్ జెర్సీలలో తన జెర్సీని వినూత్నంగా డిజైన్ చేయించుకుని ధరించాడు. ఆ సీజన్ ఫైనల్లో చెలరేగి మరోసారి చికాబో బుల్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఇకపోతే 1998 ఫైనల్ గేమ్ పట్ల మళ్లీ ఆసక్తి కలగడానికి ఓ కారణముంది. 2020లో ESPN/Netflixలో 'ది లాస్ట్ డ్యాన్స్' అనే టైటిల్‌తో విడుదలైన డాక్యుమెంటరీలో ఆనాటి గేమ్, జోర్డాన్ జెర్సీ, జోర్డాన్ ఆట అన్నింటినీ విశ్లేషించారు. ఆరోసారి ఎన్బీఏ ఛాంపియన్‌షిప్ సాధించడానికి చికాగో బుల్స్ ప్రయత్నాలను కూడా ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచారు. 1998 NBA ఫైనల్స్ ఇప్పటివరకు అత్యధికంగా వీక్షించబడిన NBA ఫైనల్స్ సిరీస్‌గా నిలిచింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Read more about: michael jordan
Story first published: Friday, September 16, 2022, 8:27 [IST]
Other articles published on Sep 16, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X