న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత ఆటగాళ్లు డోపింగ్‌కు పాల్పడింది వాస్తవమేనా..?

Doping scandal fears at Commonwealth Games as 12 Indian boxers are taken in for drug testing and officials conduct lab tests after finding syringe

హైదరాబాద్: ఆటగాళ్లు జట్టులో మెరుగ్గా రాణించేందుకు అంతకుముందు లేని శక్తిని కొనితెచ్చుకునేందుకు ఉత్ప్రేరకాలను వినియోగిస్తుంటారు. ఇలా వాడి లేనిపోని సమస్యలను సైతం కొనితెచ్చుకున్న సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడు తాజాగా అలాంటి సమస్యే భారత బాక్సర్లకు వచ్చిపడింది. కామన్‌వెల్త్ క్రీడల సందర్భంగా భారత బాక్సర్లు బస చేస్తున్న భవనం దగ్గర సిరంజీలు దొరికాయి.

 బాక్సర్లకు ఏమీ తెలియదంటూ:

బాక్సర్లకు ఏమీ తెలియదంటూ:

వీటి గురించి మా బాక్సర్లకు ఏమీ తెలియదంటూ భారత తరపు అధికారి తేల్చి చెప్పినా.. గదుల బయట సిరంజీలు బయటపడ్డ ఉదంతంలో భారత బాక్సర్లకు చిక్కులు తప్పేలా లేవు. మొత్తం 12 మంది భారత బాక్సర్లకూ డోప్‌ పరీక్షలు నిర్వహించారు. త్వరలోనే ఫలితాలు రానున్నాయి. సిరంజీలు వాడకున్నా.. అవి భారత బాక్సర్లకు చెందినవే అని విచారణలతో తేలితే నిబంధనల ప్రకారం వారిపై కఠిన శిక్షలు తప్పవు.

అసలు బయటపడిందిలా:

అసలు బయటపడిందిలా:

సిరంజీలు తమ ఆటగాళ్లవి కావని భారత జట్టు మేనేజర్‌ అజయ్‌ నారంగ్‌ చెప్పాడు. దారిలో, నలిపేసిన నీళ్ల సీసాలో అవి డోపింగ్‌ నిరోధ సంస్థ అధికారులకు దొరికాయని తెలిపాడు. శనివారం గోల్డ్‌కోస్ట్‌లో భారత సీనియర్‌ బాక్సర్లు బస చేసిన గదుల బయట సిరంజీలు దొరికాయి.

 నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతుండగా:

నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతుండగా:

భారత క్రీడాకారులెవరైనా డోపింగ్‌కు పాల్పడ్డారేమో అన్న అనుమానాలు తలెత్తాయి. ఇంకో నాలుగు రోజుల్లో కామన్వెల్త్‌ క్రీడలు ఆరంభం కానున్న తరుణంలో ఈ పరిణామం పెద్ద చర్చకే దారి తీసింది. ఆ సిరంజీలను గమనించిన సిబ్బంది.. తనకు తెలిపారని కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్‌) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ గ్రీవెంబర్గ్‌ వెల్లడించారు.

 భారత బృందంతో ఉన్న అధికారి:

భారత బృందంతో ఉన్న అధికారి:

అయితే... దీనిని భారత బృందంతో ఉన్న అధికారి తీవ్రంగా పరిగణించి, ఖండించారు. 'సిరంజీలు మా ఆటగాళ్ల గదుల్లో దొరకలేదు. వివిధ దేశాల క్రీడాకారులంతా ఉన్న భవనం వద్ద లభించాయి. మేమే వాటిని సీజీఎఫ్‌ వైద్యాధికారులకు అప్పగించాం. తర్వాత వారి నుంచి ఎటువంటి సమాచారం లేదు' అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అధికార బృందం...ఆస్ట్రేలియా డోపింగ్‌ నిరోధ సంస్థ అధికారులు స్థానిక పోలీసులు విచారణను తీవ్రతరం చేశారు.

Story first published: Monday, April 2, 2018, 11:14 [IST]
Other articles published on Apr 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X