న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mirabai Chanu: మీరాకు బంపర్‌ ఆఫర్‌.. జీవిత‌కాలం ఫ్రీగా పిజ్జా!!

Dominos announces life time free pizza for Mirabai Chanu after wins silver medal at Tokyo Olympics
Tokyo Olympics 2020: Domino’s Announces Special Gift For Mirabai Chanu | Oneindia Telugu

టోక్యో: మీరాబాయి చాను.. ప్రస్తుతం ఎవరి నోటా విన్నా ఇదే పేరు. ప్రస్తుతం భారత దేశం అంతటా వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే.. టోక్యో ఒలింపిక్స్‌ 2021లో వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో రజతం గెలిచిన మీరా.. ఒక్కసారిగా హీరో అయిపోంది. ఒలింపిక్స్‌లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరీ తర్వాత మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో పతకం సాధించిన రెండో మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. దేశానికి మెడల్ అందించిన మీరాపై ప్ర‌శంస‌ల‌తో పాటు అవార్డులు, రివార్డులు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమెను ఓ బంపర్‌ ఆఫర్‌ వరించింది. తాజాగా 'డొమినోస్ పిజ్జా' మీరాకు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది.

మెరిసిన ప్రియా మాలిక్‌.. భారత్‌ ఖాతాలో బంగారు పతకంమెరిసిన ప్రియా మాలిక్‌.. భారత్‌ ఖాతాలో బంగారు పతకం

ఉచితంగా పిజ్జా ఇవ్వ‌డం కంటే:

మీరాబాయి చానుకు పిజ్జా అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. ఈ విష‌యాన్ని టోక్యోలో పతకం గెలిచిన త‌ర్వాత మీరా ఒక జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పింది. 'నేను పతకం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు పిజ్జా అంటే ఎంతో ఇష్టం. ఈ విజయానికి గుర్తుగా ముందు నేను పిజ్జా తింటాను. దానిని తిని చాలా రోజులైంది' అని ఆమె చెప్పింది. మీరా మాటలు విన్న డొమినోస్ పిజ్జా వెంట‌నే ఓ ట్వీట్ చేసింది. 'మెడ‌ల్‌ను తీసుకొస్తున్నందుకు కంగ్రాట్స్‌. వంద కోట్ల‌కు పైగా భార‌తీయుల క‌ల‌ల‌ను సాకారం చేశావు. నీకు జీవిత‌కాలం ఉచితంగా పిజ్జా ఇవ్వ‌డం కంటే సంతోషం మాకు మ‌రొక‌టి ఉండ‌దు' అని డొమినోస్ ట్వీట్ చేసింది. ఇకపై మీరా తనకు ఇష్టమైన పిజ్జాలను ఎన్నో తినొచ్చు.

 నజరానాతో పాటు:

నజరానాతో పాటు:

అంతకుముందు మీరాబాయి చానుకు మణిపూర్‌ సీఎం ఎన్‌ బీరెన్‌ సింగ్‌ భారీ నజరానా ప్రకటించారు. రూ.కోటి నజరానాతో పాటు ఓ ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు ప్రకటించారు. సీఎం ఆమెతో వీడియోకాల్‌లో మాట్లాడారు. అనంతరం సీఎం బీరెన్‌ సింగ్‌ మాట్లాడుతూ... 'ఈ రోజు షిల్లాంగ్‌లో ఈశాన్య రాష్ట్రాల సీఎంల సమావేశంలో నీ గెలుపు చర్చించాం. అక్కడే ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా ఎంతో ఆనందించారు. దేశం గర్వించదగిన విషయమని ప్రశంసించారు. అమిత్‌ షాతో పాటు అంతా నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు' అని వెల్లడించారు. ప్రస్తుతం రైల్వే టీసీగా పనిచేస్తున్న మీరాకు ఆ ఉద్యోగానికి బదులుగా మరో కొత్త ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు సీఎం హామీ ఇచ్చారు.

 నా కల సాకారమైంది:

నా కల సాకారమైంది:

చివరకు నా కల సాకారమైంది అని శనివారం మీరాబాయి చాను ట్వీట్‌ చేసింది. గోల్డ్ కోసం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించాన‌ని చెప్పింది. తాను సాధించిన రజత పతకాన్ని ముద్దాడుతున్న ఫొటోను షేర్‌ చేసింది. అంతకుముందు చేసిన మరో ట్వీట్‌లో.. 'నేను సాధించిన ఈ పతకాన్ని దేశానికి అంకితం చేస్తున్నా. ఈ ప్రయాణంలో నాతో ఉండి నా గెలుపుకోసం ప్రార్థించిన కోట్లాది భారత ప్రజలకు కృతజ్ఞతలు. నా కుటుంబం, ప్రత్యేకించి మా అమ్మ నాపై పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు చెబుతున్నా. నన్ను ఇంతలా ప్రోత్సహించిన భారత ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు' అని రాసుకొచ్చింది.

కలిసొచ్చిన కరోనా:

కలిసొచ్చిన కరోనా:

కరోనా మహమ్మారిని అందరూ తిట్టుకునేవాళ్లే.. కానీ మీరాకు మాత్రం కలిసొచ్చింది. గత ఏడాది ఒలింపిక్స్‌ షెడ్యూల్‌ ప్రకారం జరిగి ఉంటే ఆమె పతకం గెలిచేది కాదేమో. ఎందుకంటే అప్పటికి ఆమె ఫిట్‌నెస్‌ అత్యుత్తమ స్థాయిలో లేదు. 2019 ఆమె వెన్ను, భుజం గాయాలతో ఇబ్బంది పడింది. ఆ ప్రభావం తర్వాతి ఏడాదీ కొనసాగింది. కొన్ని నెలల పాటు బరువులెత్తలేదు. కరోనా కారణంగా ఒలింపిక్స్‌తో పాటు పోటీలన్నీ రద్దవడంతో నెమ్మదిగా గాయాల నుంచి కోలుకుంది. కరోనా వల్ల మీరాకు జరిగిన మరో మేలు.. ఉత్తర కొరియా ఒలింపిక్స్‌ నుంచి తప్పుకోవడం. గట్టి పోటీదారైన ఆ దేశ లిఫ్టర్‌ దూరం కావడంతో చానుకు పతక రేసులో ఓ అడ్డంకి తొలగిపోయింది.

Story first published: Sunday, July 25, 2021, 16:46 [IST]
Other articles published on Jul 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X