న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీవీ సింధు-నిఖత్ జరీన్: కళ్లప్పగించి చూడాల్సిన మ్యాచ్‌లు ఇవే..!!

 CWG 2022 Day 10 India Full Schedule are here including PV Sindhus Womens singles semifinal

బర్మింగ్‌హామ్: ఇంగ్లాండ్ బర్మింగ్‌హామ్ వేదికగా కామన్‌వెల్త్ గేమ్స్ 2022 ఈవెంట్స్ రసవత్తరంగా సాగుతోన్నాయి. భారత్ పతకాల పంట పండిస్తోంది. దాదాపుగా అన్ని ఈవెంట్లల్లోనూ పతకాలను కొల్లగొట్టేస్తోంది. బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌లో టీమిండియాకు ఎదురు ఉండట్లేదు. ఇప్పటివరకు 26 మెడల్స్‌లను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో బంగారు-13, వెండి-11, రజతం-16 ఉన్నాయి. పతకాల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది.

ఇంకో బంగారు పతకంపై కర్చీఫ్ వేసుక్కూర్చున్న టీమిండియా: ఆ రివెంజ్ ఇంకా బాకీ ఉంది..!!ఇంకో బంగారు పతకంపై కర్చీఫ్ వేసుక్కూర్చున్న టీమిండియా: ఆ రివెంజ్ ఇంకా బాకీ ఉంది..!!

కీలక ఈవెంట్లల్లో..

కీలక ఈవెంట్లల్లో..

ఇంకా కొన్ని కీలక ఈవెంట్లు ముందు ఉండటంతో ఈ సంఖ్య పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. క్రికెట్‌లో ఇప్పటికే వెండి పతకం ఖాయమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు ఫైనల్స్‌కు చేరింది. పసిడి పతకం కోసం ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. బ్యాడ్మింటన్, విమెన్స్ బాక్సింగ్, టేబుల్ టెన్నిస్ వంటి కీలక ఈవెంట్లల్లో భారత క్రీడాకారులు సెమీ ఫైనల్స్ వరకు వెళ్లగలిగారు. సెమీస్‌లో విజయం సాధించితే పతకం ఖాయం అయ్యే దశలో ఉన్నారు.

హాకీతో మొదలు..

హాకీతో మొదలు..

భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు హాకీలో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఉంటుంది. 2 గంటలకు- బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో పీవీ సింధు తలపడనుంది. 3:10 గంటలకు బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్స్‌లో లక్ష్యసేన్, రెండో సెమీఫైనల్స్‌లో కిడాంబి శ్రీకాంత్.. తమ ప్రత్యర్థులతో తలపడనున్నారు. సాయంత్రం 4 గంటలకు మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ సెమీస్‌లో గాయత్రి గోపిచంద్/జాలీ ట్రెస్సా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

 పతకాలకు చేరువగా..

పతకాలకు చేరువగా..

పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో సాత్విక్ రాజ్/చిరాగ్ షెట్టి జోడీ ప్రత్యర్థులను ఢీకొట్టబోతోంది. పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్‌లో అబ్దుల్లా అబూబాకర్, ఎల్డోస్ పాల్, ప్రవీణ్ చిత్రవేల్ పాల్గొననున్నారు. రస్ వాక్ ఫైనల్‌లో అమిత్, సందీప్ కుమార్, మహిళల జావెలిన్ త్రో ఫైనల్స్‌లో భారత థ్రోయర్స్ శిల్పా రాణి, అన్ను రాణి.. పాల్గొననున్నారు. పురుషుల జావెలిన్ థ్రో ఫైనల్స్‌లో రోహిత్ యాదవ్, డీపీ మను పెర్ఫార్మెన్స్ ఉంటుంది.

బౌలర్ల విశ్వరూపం... బ్యాటర్ల పంతం,5 కారణాలివే *Cricket | Telugu OneIndia
నిఖత్ జరీన్ సహా.

నిఖత్ జరీన్ సహా.

బాక్సింగ్ మహిళల లైట్ ఫ్లైవెయిట్‌లో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ తలపడనుంది. ఈ గేమ్ ఈ సాయంత్రం 7 గంటలకు లైవ్ టెలికాస్ట్ అవుతుంది. పురుషుల లైట్ ఫ్లైవెయిట్‌లో అమిత్ ఫంగల్, హెవీ వెయిట్ ఫైనల్స్‌లో సాగర్ అహ్లావత్.. సత్తా చూపించనున్నారు. టేబుల్ టెన్నిస్‌లో మహిళల సింగిల్స్ రజత పతకం మ్యాచ్‌లో శ్రీజ ఆకుల తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మెన్స్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్/జీ సథియన్ జోడీ- తమ ప్రత్యర్థులను ఢీ కొట్టనుంది. స్క్వాష్ డబుల్స్‌లో రజత పతం కోసం దీపిక పల్లికల్/సౌరవ్ ఘోషల్ మ్యాచ్ ఉంటుంది.

Story first published: Sunday, August 7, 2022, 10:17 [IST]
Other articles published on Aug 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X