కామన్వెల్త్ గేమ్స్: భారత్ పతకాల వర్షం, 17కి చేరిన పతకాల సంఖ్య

Posted By:
Commonwealth Games 2018: Jitu Rai wins gold, Om Mitharval bags bronze in shooting

హైదరాబాద్: భారత్‌కు మునుపెన్నడూ లేని విధంగా పతకాల వర్షం కురుస్తోంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. సోమవారం మరో రజితంతో ప్రదీప్ మెరిశాడు. ఇప్పటికే వెయిట్ లిఫ్టర్లు మీరాబాయి చాను, సంజిత చాను, సతీశ్ శివలింగం, రాగాల వెంకట రాహుల్, పూనమ్ యాదవ్ భారత్‌కి పసిడి పతకాలు అందించారు.

స్వర్ణం కొద్దిలో తప్పిపోయింది:

స్వర్ణం కొద్దిలో తప్పిపోయింది:

కామన్వెల్త్‌లో ఐదోరోజైన సోమవారం ప్రదీప్ సింగ్ రజిత పతకాన్ని గెలుపొందాడు. 105 కేజీల విభాగంలో పోటీపడిన ప్రదీప్.. మొత్తం 352 కిలోలు ఎత్తి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కి 9వ పతకాన్ని అందించాడు. దీంతో ఇప్పుడు భారత్ ఖాతాలో మొత్తం 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. స్నాచ్‌లో గరిష్ఠంగా 152 కిలోలు ఎత్తిన ప్రదీప్ సింగ్ భారత్‌కి మరో పసిడి పతకం అందించేలా కనిపించాడు. క్లీన్ అండ్ జర్క్‌లో ఈ జలంధర్ వెయిట్ లిఫ్టర్ తడబడ్డాడు.

352 కేజీలు ఎత్తినందుకు గాను రజతంతోనే:

352 కేజీలు ఎత్తినందుకు గాను రజతంతోనే:

మొదటి ప్రయత్నంలో 200 కిలోలు ఎత్తినా.. తర్వాత వరుసగా 209, 211 కిలోలను ఎత్తడంలో విఫలమయ్యాడు. మొత్తం 152, 200 కిలోలతో 352 కేజీలు ఎత్తినందుకు గాను రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఏడాది కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన ప్రదీప్ అక్కడ క్లీన్ అండ్ జర్క్‌లో 209 కిలోలు ఎత్తడం విశేషం.

 వెయిట్ లిఫ్టర్లతో మేము సైతం అంటూ షూటర్లు:

వెయిట్ లిఫ్టర్లతో మేము సైతం అంటూ షూటర్లు:

ఇదిలా ఉంచితే, వెయిట్ లిఫ్టర్లతో పాటు మేము సైతం అంటూ షూటర్లు పతకాలు కొల్లగొడుతున్నారు. వెయిట్ లిఫ్టర్లు ఇప్పటికే 9 పతకాలు గెలుపొందగా.. షూటర్లు కూడా గట్టి పోటీనిస్తున్నారు. కామన్వెల్త్ క్రీడల రికార్డులని బద్దలు కొడుతూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ విభాగంలో ఆదివారం మనుబాకర్ స్వర్ణం గెలవగా.. సోమవారం ఈ విభాగంలోనే జీతురాయ్ కూడా సంచలన ప్రదర్శనతో పసిడి పతకాన్ని గెలుపొందాడు.

భారత్ ఖాతాలో మొత్తం 17 పతకాలు:

భారత్ ఖాతాలో మొత్తం 17 పతకాలు:

మొత్తం 235.1 పాయింట్లు సాధించిన జీతురాయ్ కామన్వెల్త్ రికార్డుల్ని బ్రేక్ చేశాడు. అతనితో పాటు.. ఓం ప్రకాశ్ కూడా ఇదే ఈవెంట్‌లో 214.3 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుపొందాడు. దీంతో.. ఈరోజు మూడు పతకాలు చేరడంతో ఇప్పుడు భారత్ ఖాతాలో ప్రస్తుతం 8 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ షూటింగ్‌లో ఆదివారం మను బాకర్‌తో పాటు హీనా సిద్దూ (రజతం), రవికుమార్ (కాంస్యం) గెలుపొందిన విషయం తెలిసిందే.

సోమవారం షూటర్ల నాలుగు పతకాలు:

సోమవారం షూటర్ల నాలుగు పతకాలు:

సోమవారం 10మీ షూటింగ్ విభాగంలో జీతూరాయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా, మెహూలీ ఘోష్, అపూర్వి ఛండేలా వెండి పతకాన్ని సొంతం చేసుకున్నారు. వారితో పాటుగా ఓమ్ మిథర్‌వాల్ బ్రాంజ్ పతకాన్ని గెలుచుకున్నారు.

Story first published: Monday, April 9, 2018, 11:12 [IST]
Other articles published on Apr 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి