న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియన్ గేమ్స్ క్రీడాజ్యోతి మొదలైంది

Comedy of errors leave top Indian athletes hitching a ride at Asian Games 2018 torch relay

హైదరాబాద్: త్వరలో జరగనున్న ఇండోనేషియా వేదికగా జరగనున్న ఆసియన్ క్రీడా జ్యోతి మొదలైంది. ఆసియన్ గేమ్స్ మొదలైన న్యూఢిల్లీ వేదికగానే ఈ కార్యక్రమం నిర్వహించారు. మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ వేడుకను ర్యాలీగా ఇండియా గేట్ వరకూ ఊరేగించారు. ఈ మధ్య ఉన్న కాస్త దూరంలో ఆటగాళ్లందరినీ ఒకే వాహనంలో తీసుకొచ్చారు. భారతదేశం తరపున ఆడనున్న పీఆర్ శ్రీజేష్, సర్దార్ సింగ్, జీతూ రాయ్, శరత్ కమల్‌లు బస్సులో ప్రయాణించి జ్యోతిని ఇండియా గేట్ వద్దకు తెచ్చారు.

క్రీడా జ్యోతిని ఐదు సార్లు బాక్సింగ్ ఛాంపియన్ అయిన భారత బాక్సర్ మేరీకోమ్ చేతుల మీదుగా ఇండోనిషియా బ్యాడ్మింటన్ లెజెండ్, బార్సిలోనా ఒలింపిక్ స్వర్ణ విజేత సుశీ సుశాంతి అందుకున్నారు. వీరితో పాటుగా మానికా బాత్ర, కమల్, ఏస్ షూటర్ జీతూ మరికొందు క్రీడా జ్యోతిని తమ చేతులమీదుగా కాసేపు కవాతుతో నడిచారు.

వారిలో ఒకరైన టాప్ అథ్లెట్ ఒకరు మాట్లాడుతూ.. ఇదంతా గందరగోళంగా అనిపించింది. అయినా ఏదో జరిగిపోయింది కదా అంటూ వ్యాఖ్యానించారు. ఈ 2018 ఆసియన్ గేమ్స్ క్రీడాజ్యోతి 18వేల కి.మీలు ప్రయాణించి చివరగా ఇండోనేషియా చేరనుంది. ఈ క్రమంలో 1951వ సంవత్సరంలో జరిగిన ఆసియన్ గేమ్స్ ఇదే నేషనల్ స్టేడియం వేదికగా మొదలైయ్యాయి.

దాంతో భారత్‌లోని ఈ స్టేడియం వేదికగానే క్రీడాజ్యోతి ప్రతి సీజన్‌కు బయల్దేరుతుంది. ఇలా ఆసియన్ గేమ్స్‌లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికి భారత్ ఓ ప్రత్యేక ప్రదేశంగా అనిపిస్తుంది. ప్రస్తుత సంవత్సరంలో ఆగష్టు 18 నుంచి జరగనున్న ఈ వేడుకలను ఇండోనేషియా ఆసియన్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ (ఐఎన్ఏఎస్‌జీఓసీ) నిర్వహించనుంది.

Story first published: Monday, July 16, 2018, 15:55 [IST]
Other articles published on Jul 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X