కోచ్ కాదు కామాంధుడు: మసాజ్ పేరుతో మహిళా అథ్లెట్ల ప్రైవేట్ పార్ట్స్ పై...ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు

మహిళలకు ఎక్కడికి వెళ్లిన లైంగిక వేధింపులు తప్పడం లేదు. మహిళలు ఏ రంగంలో పనిచేస్తున్నా సరే వారిపై లైంగిక వేధింపులు మాత్రం తగ్గడం లేదు. ఇక క్రీడారంగం మహిళల పట్ల శాపంగా మారిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశం తరపున క్రీడల్లో పాల్గొని ప్రపంచ దేశాల సరసన సగర్వంగా భారత్‌ను నిలపాలని కలలు కంటున్న క్రీడాకారిణుల కలలు కల్లలవుతున్నాయి. ఇందుకు కారణం వారు ఆ రంగంలో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు. శిష్యురాలుగా భావించి శిక్షణ ఇవ్వాల్సిన కోచ్‌లే లైంగిక వేధింపులకు పాల్పడుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా మరో ఉదంతం వెలుగు చూసింది.

ఈ ఏడాది మే నెలలో అథ్లెటిక్స్ కోచ్‌గా ఉన్న పి. నాగరాజన్‌పై ఓ 19 ఏళ్ల జాతీయ స్థాయి మహిళా అథ్లెట్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మరో ఏడుగురు మహిళా అథ్లెట్లు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేయడం కలకలం సృష్టిస్తోంది. మహిళా అథ్లెట్లు నాగరాజన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు ప్రముఖ జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో రాసుకొచ్చింది. ఇలా ఫిర్యాదు చేసిన వారిలో కొందరు రిటైర్ అయినవారు ఉండగా మరికొందరు నాగరాజన్‌ వద్ద జూనియర్లుగా శిక్షణ పొందినవారు ఉండటం విశేషం. ఇక లైంగిక వేధింపులు గత కొన్నేళ్లుగా సాగుతున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో పేర్కొంది.

గత మూడు దశాబ్దాలుగా నాగరాజు కింద శిక్షణ పొందిన క్రీడాకారిణులు జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. కోచ్‌గా అంత మంచి గుర్తింపు ఉన్న నాగరాజన్‌లో ఈ పాడుబుద్ధి ఏంటో ఎవరికీ అర్థం కానీ విషయంగా మారింది. కోచ్ నాగరాజన్‌ పై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. మెజిస్ట్రేట్‌ వద్ద బాధితులు తమ స్టేట్‌మెంట్ ఇచ్చారు. గత నెలలోనే పోలీసులు నాగరాజన్‌పై ఛార్జిషీటు సైతం నమోదు చేశారు. వీరిలో ఇద్దరి బాధితులతో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి మాట్లాడారు. ఇక్కడే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

లైంగిక వేధింపులకు పాల్పడినట్లు

లైంగిక వేధింపులకు పాల్పడినట్లు

నాగరాజన్ కోచింగ్ పేరుతో మహిళా అథ్లెట్లను పిలిచి వారిలో కొందరిని మాత్రం బృందం నుంచి వేరు చేసేవారని తెలిపారు బాధితులు. మసాజ్ పేరుతో మహిళా అథ్లెట్లను తాకరాని చోట తాకి పైశాచికత్వాన్ని ప్రదర్శించేవాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీనేజర్లుగా ఉన్న సమయంలో ఈ ఇద్దరిపై కూడా నాగరాజన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో జూనియర్ విభాగంలో రికార్డు నెలకొల్పిన ఓ అథ్లెట్ తన బాధను చెప్పుకొచ్చింది. తాను ఎవరితోనే అంతగా కలుపుగోలు తనంగా ఉండేది కాదని చెప్పింది. పైగా కోచ్ అంటే తనకు చాలా భయం వేసేదని... తను లైంగికంగా వేధించిన సమయంలో తిరిగి ఎదురు చెప్పలేకపోయినట్లు వెల్లడించింది. మరో అథ్లెట్‌ అయితే తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు వెల్లడించింది. ఇక ప్రస్తుతం మూడు పదుల వయసులో ఉన్న తాను పురుషులంటేనే నమ్మకం ఏర్పడటం లేదని, ఎవరితోనైనా జీవితం పంచుకోవాలంటే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో రాసుకొచ్చింది.

ప్రాక్టీస్ అయ్యాక కోచ్

ప్రాక్టీస్ అయ్యాక కోచ్

ఇక కోచ్ నాగరాజన్ కామలీలలు ఎందాక వెళ్లాయంటే మసాజ్ పేరుతో మహిళా అథ్లెట్లను అతి దారుణంగా వేధించేవాడు. అయితే అతనికి ఎదురు తిరిగినా లేక మసాజ్ సెషన్‌కు గైర్హాజరైనా.. అలాంటి వారిని కావాలనే మందలిస్తూ వారి క్యారెక్టర్ మంచిదికాదని విషప్రచారం చేసేవాడని బాధితులు పేర్కొన్నారు. "నేను అండర్ -16 నేషనల్ రికార్డును బ్రేక్ చేశాను. ఆ సమయంలోనే లైంగిక వేధింపులు ప్రారంభమయ్యాయి. ప్రాక్టీస్ అయ్యాక కోచ్ నాగరాజన్ ఆగమన్నారు. మరింత శిక్షణ ఇవ్వాల్సి ఉంది అని చెప్పేవారు. నాకు మోకాలు నొప్పి ఉందని చెబితే.. నొప్పి లేకుండా నేను చేస్తాను అని చెప్పేవారు. ఈ కారణంతో నా ప్రైవేట్ పార్ట్స్‌ను తాకేవాడు. ఆ సమయంలో నేను చాలా ఇబ్బందికి గురయ్యాను. మా అమ్మకు చెబితే నా కెరీర్ దెబ్బతింటుందేమో అని భయపడ్డాను. తొలిసారి ఇలా జరిగినప్పుడు నా వయస్సు 15 ఏళ్లు" అని ఓ బాధితురాలు నాగారాజన్ గురించి చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. నాగరాజన్ వద్ద పదేళ్లకు పైగా ఆమె శిక్షణ పొందినట్లు స్పష్టం చేసింది.

ఒళ్లో కూర్చోబెట్టుకునేవాడని

ఒళ్లో కూర్చోబెట్టుకునేవాడని

ఇక నాగరాజన్ ఎంతో మందిని ఛాంపియన్లుగా తయారు చేసినందున అతను అలా లైంగికంగా వేధించినప్పుడు ఎదురు చెప్పాలంటే భయపడేదాన్నని ఆ మహిళా అథ్లెట్ చెప్పారు. కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళుతానని నాగరాజన్ చెప్పేవాడని గుర్తు చేసింది మహిళా అథ్లెట్. స్ట్రెచింగ్ ఎలా చేయాలో నేర్పుతానని చెబుతూ ముందుగా తనపై చేయి వేసేవాడని ఆ తర్వాత తన ఒళ్లో కూర్చోబెట్టుకునేవాడని మహిళా అథ్లెట్ వివరించింది. తనను తండ్రిలా భావించాలని చెప్పేవాడని గుర్తుచేసుకుంది. ఆ వయసులో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదని చెబుతూ భోరున విలపించింది.శిక్షణ ముగియగానే గ్రౌండ్ నుంచి పారిపోయేదాన్నని గుర్తు చేసుకుంది.

ఇక మరో మహిళా అథ్లెట్ తనకు నాగరాజన్ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. "నా పై లైంగిక వేధింపులు ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతూ వచ్చాయి. భార్యా భర్తలు ఎలాగైతే ఉంటారో అలాగే ఉండాలని నాగరాజన్ చెప్పాడు. లైంగిక వేధింపుల గురించి నా తల్లిదండ్రులకు చెప్పాను. అయితే నా క్యారెక్టర్ మంచిది కాదని మా అమ్మ నాన్నలకు నాగరాజన్ చెప్పాడు. అబ్బాయిలతో ఎక్కువగా చనువుతో ఉంటోందని చెప్పాడు. మా కుటుంబంలో అమ్మాయిలు చాలా పద్దతిగా పెరుగుతారు. అబ్బాయితో స్నేహమంటేనే ఒప్పుకోరు. అలాంటిది నాపై అనవసరపు నిందవేశాడు" అని బాధను వెళ్లగక్కింది. తనను ఎంతో నియంత్రించేవాడని బయట ప్రపంచంతో కలవనిచ్చేవాడు కాదని ఈ అథ్లెట్ వివరించింది. అంతేకాదు మీడియాతో మాట్లాడనిచ్చేవాడు కాదని ఎవరైనా నాతో మాట్లాడాలంటే ముందుగా కోచ్‌ను అప్రోచ్ కావాల్సిందేనని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.

నీ కెరీర్ మొత్తం పాడవుతుందని

నీ కెరీర్ మొత్తం పాడవుతుందని

ఇక ఎలాగో అలాగ ధైర్యం తెచ్చుకుని కోచ్‌కు ఎదురు మాట్లాడేందుకు ప్రయత్నించగా తనకున్న రిప్యూటేషన్‌ను దెబ్బతీస్తానని నాగరాజన్ బెదిరించినట్లు ఈ మహిళా అథ్లెట్ వెల్లడించింది. ఆ సమయంలో తాను మంచి అథ్లెట్‌గా గుర్తింపు సాధించి కెరీర్‌లో ముందుకు వెళుతున్నట్లు స్పష్టం చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడితే మీడియాకు ఫిర్యాదు చేస్తానని చెప్పగా... ఫిర్యాదు చేస్తే చేయి.. నువ్వు కూడా సహకరించావని అదే మీడియా ముందు చెబుతానని దీంతో నీ కెరీర్ మొత్తం పాడవుతుందని బెదిరించి నోరు మూయించేవాడని మహిళా అథ్లెట్ పేర్కొంది. ఇక క్లబ్‌ను వీడేందుకు సిద్ధమైన సమయంలో తనను క్షమించాల్సిందిగా కోచ్ నాగరాజన్ వేడుకున్నట్లు గుర్తు చేసుకుంది.

"నా కాళ్లపై పడి క్షమాపణ కోరాడు. అంతేకాదు తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. నేను కూడా అదే చెప్పుతో కోచ్‌ను కొట్టాను. అయితే 2011 నేనొక్కదాన్నే లైంగిక వేధింపులకు గురయ్యాననే భావనలో ఉండేదాన్ని. కానీ మే 26వ తేదీన ఓ ట్వీట్‌లో చాలామంది బాధితులు బయటకొచ్చి తమకు జరిగింది వివరించారు" అని ఈ మహిళా అథ్లెట్ పేర్కొంది. అయితే ఈ ట్వీట్లు బహిర్గతం కాగానే తాను మంచి వ్యక్తినని సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా తనకు నాగరాజన్ ఫోన్ చేసినట్లు వెల్లడించింది. ఇక ఫోన్ పెట్టేసి తను అనుభవించిన క్షోభ గురించి బయటపెట్టాలని భావించి ఇదంతా చెబుతున్నట్లు ఆమె స్పష్టం చేసింది .

ఇలా నాగరాజన్ వేసిన వేషాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికైనా ఇలా కామంతో కొట్టుమిట్టాడుతున్న కోచ్‌లు ఎవరైనా ఉంటే.. మహిళా క్రీడాకారిణిలు వెంటనే వెలుగులోకి నిర్భయంగా తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 8, 2021, 13:00 [IST]
Other articles published on Sep 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X