లైవ్ ఇంటర్వ్యూ చేస్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన బీబీసీ రిపోర్టర్ (వీడియో)

Posted By:
BBC Breakfast presenter falls into swimming pool during live interview

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌‌లో ఓ ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. బీబీసీ రిపోర్టర్ మైక్ బుషెల్ లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. బీబీసీ బ్రేక్‌ఫాస్ట్ షో కోసం స్విమ్మింగ్‌లో మెడల్ సాధించిన ఇంగ్లాండ్ టీమ్‌తో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు.

అదే సమయంలో స్విమ్మర్స్ అంతా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉన్నారు. దీంతో ఆ రిపోర్టర్ కూడా వాళ్లతో లైవ్ ఇంటర్వ్యూ చేస్తూ.. వాళ్ల పక్కనే కాసేపు కూర్చున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా స్విమ్మింగ్ పూల్‌లోకి దిగాడు. అలా రిపోర్టింగ్ చేస్తూనే మరో అడుగు ముందుకు వేయబోయాడు.

BBC Breakfast presenter falls into swimming pool during live interview

ఇంతలో అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో స్మిమ్మింగ్ పూల్‌లోనే జారి ప‌డిపోయాడు. వెంటనే తేరుకొని సారీ చెబుతూ.. మళ్లీ తన రిపోర్టింగ్ మొదలుపెట్టాడు. ఈ ఫన్నీ సన్నివేశాన్ని చూసి ఇంటర్వ్యూ ఇస్తున్న ఇంగ్లాండ్ స్విమ్మింగ్ టీమ్ తెగ నవ్వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీంతో ఇంగ్లాండ్ స్విమ్మింగ్ టీమ్‌తో పాటు నెటిజన్లు కూడా ఆ వీడియోను చూసి నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే ఈ సన్నివేశాన్ని మూమెంట్ ఆఫ్ ద ఇయర్‌గా అభివర్ణించాడు.

Story first published: Wednesday, April 11, 2018, 17:25 [IST]
Other articles published on Apr 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి