కామన్వెల్త్ గేమ్స్ - 2022 కోసం 37 మంది సభ్యులతో కూడిన భారత అథ్లెటిక్స్ బృందాన్ని అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఫ్ఐ) ఎంపిక చేసింది. ఈ బృందానికి నీరజ్ చోప్రా నాయకత్వం వహించనున్నాడు. CWG - 2022లో ప్రముఖ హై జంపర్ తేజస్విన్ శంకర్‌ను అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేయలేదు. జులైలో ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఈ గేమ్స్ కోసం 37మంది సభ్యుల బృందాన్ని ప్రకటించింది. AFI ఎంపిక చేసిన 37మంది సభ్యుల జట్టులో 18మంది మహిళ అథ్లెట్లు ఉండడం విశేషం.
ఇక ఈ ఎంపికలో భారత్ తరఫున పోటీ పడతున్న స్టార్ ప్లేయర్ టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మీద భారీ అంచనాలున్నాయి. ఇక అతను ఇటీవల ఫిన్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్‌లో తన జాతీయ రికార్డును తానే బద్దలు కొట్టాడు. పురుషుల జావెలిన్ స్క్వాడ్‌లో నీరజ్‌తో పాటు రోహిత్ యాదవ్, DP మనులు కూడా ఉన్నారు. 4x400మీ రిలే జట్టులో ద్యుతీ చంద్, హిమా దాస్ లాంటి స్టార్లు పాల్గొననున్నారు.
కామన్ వెల్త్ గేమ్స్ - 2022 కోసం ఎంపికైన అథ్లెటిక్స్ స్క్వాడ్
మెన్స్: అవినాష్ సాబుల్ (3000మీ. స్టీపుల్‌చేజ్); నితేందర్ రావత్ (మారథాన్); ఎం శ్రీశంకర్, ముహమ్మద్ అనీస్ యాహియా (లాంగ్ జంప్); అబ్దుల్లా అబూబకర్, ప్రవీణ్ చిత్రవేల్, ఎల్దోస్ పాల్ (ట్రిపుల్ జంప్); తాజిందర్‌పాల్ సింగ్ టూర్ (షాట్ పుట్); నీరజ్ చోప్రా, డిపి మను, రోహిత్ యాదవ్ (జావెలిన్ త్రో); సందీప్ కుమార్, అమిత్ ఖత్రి (రేస్ వాకింగ్); అమోజ్ జాకబ్, నోహ్ నిర్మల్ టామ్, ఆరోకియా రాజీవ్, మహమ్మద్ అజ్మల్, నాగనాథన్ పాండి, రాజేష్ రమేష్ (4x400మీ రిలే).
వుమెన్స్: ఎస్ ధనలక్ష్మి (100మీ, 4x100మీ రిలే); జ్యోతి యర్రాజీ (100మీ హర్డిల్స్); ఐశ్వర్య బి (లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్), ఆన్సి సోజన్ (లాంగ్ జంప్); మన్‌ప్రీత్ కౌర్ (షాట్ పుట్); నవజీత్ కౌర్ ధిల్లాన్, సీమా యాంటిల్ పునియా (డిస్కస్ త్రో); అన్నూ రాణి, శిల్పా రాణి (జావెలిన్ త్రో); మంజు బాలా సింగ్, సరితా రోమిత్ సింగ్ (హ్యామర్ త్రో); భావనా జాట్, ప్రియాంక గోస్వామి (రేస్ వాకింగ్); హిమ దాస్, ద్యుతీ చంద్, శ్రబని నందా, MV జిల్నా, NS సిమి (4x100m రిలే).