న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలంగాణ‌ అథ్లెట్‌కు ఆర్థిక క‌ష్టాలు.. దాత‌లు ఆదుకోవాల‌ని విన్న‌పం

Athlete Eslavath aloji Naik appeal to donors to support him

అత‌నో అంత‌ర్జాతీయ స్థాయి అథ్లెట్. అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌లు ప‌త‌కాల‌ను కొల్ల‌గొట్టాడు. ప్ర‌పంచ టోర్న‌మెంట్‌ల‌లో బంగారు ప‌త‌కాల‌ను సైతం గెలిచాడు. అత‌ని ప్ర‌తిభ‌ను గుర్తించి ప‌లు అవార్డులు కూడా ద‌క్కాయి. కానీ ఇవ‌న్నీ చెప్పుకోవ‌డానికే అన్న‌ట్టుగా మిగిలిపోయాయి. ప‌త‌కాలు వ‌చ్చాయి. అవార్డులు వ‌చ్చాయి. కానీ ఆర్థిక ఎదుగుద‌ల‌కు డ‌బ్బులు మాత్రం రాలేదు. దీంతో ప్ర‌స్తుతం ఆర్థిక స‌మ‌స్యల‌తో రానున్న పోటీల్లో పాల్గొన‌డ‌మే అనుమానంగా మారింది.

ప‌త‌కాలు, అవార్డులు సొంతం

ప‌త‌కాలు, అవార్డులు సొంతం

ఇంత‌టి దీన స్థితిలో ఉన్నా ఆ అథ్లెట్ పేరు ఇస్లావ‌త్ ఆలోజీ నాయ‌క్‌. తెలంగాణ‌లోని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన కేస‌ముంద్రం మండంలోని కోమ‌టిపల్లి గ్రామం స‌మీపంలో కోక్య తండాకు చెందిన ఆలోజీ మంచి అథ్లెట్‌. రాష్ట్ర, జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంద‌డ‌మే కాకుండా దేశానికి బంగారు ప‌త‌కాలు సైతం సాధించిపెట్టాడు. ఆలోజీ ప్ర‌తిభ‌ను గుర్తించి అత‌న్ని ఇండియ‌న్‌ స్టార్ ఐకాన్ అవార్డు కూడా వ‌రించింది. ఇండియా స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ అధ్వ‌ర్యంలో ఆలోజికి ఇండియ‌న్ స్టార్ ఐకాన్ అవార్డు ప్ర‌దానం చేశారు.

వెంటాడుతున్న ఆర్థిక క‌ష్టాలు

వెంటాడుతున్న ఆర్థిక క‌ష్టాలు

ఇంత సాధించిన‌ప్ప‌టికీ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆలోజీని ఆర్థిక క‌ష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్థిక క‌ష్టాల‌తో ఇప్పటికే ఆలోజీ ప‌లు టోర్నీల‌కు దూర‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో ఈ నెల 21, 22, 23వ తేదీల్లో జాతీయ స్థాయిల్లో ఒలింపిక్స్ ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్ ఇండియా వారి అధ్వ‌ర్యంలో జ‌రిగే జాతీయ అథ్లెటిక్స్ పోటీల‌కు ఆలోజీ ఎంపిక‌య్యాడు. ఢిల్లీ వేదిక‌గా జ‌రిగే ఈ పోటీల్లో 200 మీట‌ర్లు, 400 మీట‌ర్ల ప‌రుగు పందెం పోటీల్లో ఆలోజీ పోటీప‌డ‌నున్నాడు. ఈ త‌రుణంలో ఆర్థిక స‌మ‌స్యల‌తో ఇప్ప‌టికే ప‌లు టోర్నీలకు దూర‌మైన ఆలోజీ ఈ పోటీల‌కు కూడా దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఏర్పడింది.

దాత‌లు ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి

దాత‌లు ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి

దీంతో ఆర్థిక క‌ష్టాల‌తో ఇబ్బంది ప‌డుతున్న ఆలోజీ ఈ పోటీల్లో పాల్గొన‌డానికి త‌న‌కు దాత‌లు స‌హాయం చేయాల‌ని కోరుతున్నాడు. పోటీల్లో పాల్గొనేందుకు 50 వేల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతాయ‌ని ఒలంపిక్ స్టేట్ సెక్ర‌ట‌రీ సుద‌ర్శ‌న్ గౌడ్ తెలిపారు. స‌హాయం చేయాల‌నుకునే దాత‌లు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా అయినా చేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు. సాయం చేసేవారు 7095750322 అనే నంబ‌ర్‌కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డ‌బ్బులు పంపాల‌ని కోరారు. లేదా ఆ నంబ‌ర్‌కు ఫోన్ చేసి నేరుగా క‌లిసి అయినా డ‌బ్బులు ఇవ్వ‌చ్చ‌ని సుద‌ర్శ‌న్ గౌడ్ తెలిపారు. కాగా ఈ సారి కూడా జాతీయ స్థాయిలో ప‌త‌కం సాధిస్తాన‌ని ఆలోజీ ధీమా వ్య‌క్తం చేస్తున్నాడు.

Story first published: Thursday, January 6, 2022, 13:19 [IST]
Other articles published on Jan 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X