న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా గేమ్స్: పతక విజేతలకు ఘనస్వాగతం (ఫోటోలు)

By Nageshwara Rao
Asian Games 2018: Medal winners get warm welcome at Delhi’s IGI airport

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరిగిన 18వ ఆసియా గేమ్స్‌లో పతకాలు నెగ్గి భారత జాతీయ పతకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులు, అథ్లెట్లు సోమవారం స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత పతక విజేతలకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

దేశానికే గర్వ కారణంగా నిలిచిన క్రీడాకారులకు, అథ్లెట్లకు అభిమానులు పెద్దఎత్తున జేజేలు పలికారు. గత ఆదివారంతో ముగిసిన ఆసియా గేమ్స్‌లో భారత్ మొత్తం 69 పతకాలతో ఎనిమిదవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్య పతకాలు ఉన్నాయి.

అమిత్‌ పంగల్

అమిత్‌ పంగల్

49 కేజీల లైట్ వెయిట్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గిన బాక్సర్ అమిత్‌ కుమార్‌కు న్యూఢిల్లీలోని ఇందిరాగాందీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జేజేలు పలికిన భారత అభిమానులు. 49 కేజీల లైట్ వెయిట్ ఫ్లై బాక్సింగ్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన 22 ఏళ్ల బాక్సర్ అమిత్ పంగల్ స్వర్ణ పతకం సాధించాడు. స్వర్ణ పోరులో రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేత, ఉజకిస్థాన్ బాక్సర్ హసన్‌బాయ్ దస్మోస్తవ్‌ను 3-2 తేడాతో అమిత్ పంగల్ చిత్తుగా ఓడించాడు. తద్వారా ఈ ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించి ఏకైక భారత బాక్సర్‌గా అమిత్ పంగల్ చరిత్ర సృష్టించాడు.

హిమ దాస్

హిమ దాస్

ఇండోనేషియా వేదికగా జరిగిన 18వ ఆసియా గేమ్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో హిమదాస్ రెండు పతకాలతో స్వదేశానికి తిరిగొచ్చింది. ఈ సందర్భంగా ఆమెను హత్తుకున్న కుటుంబ సభ్యులు. హిమ దాస్ మహిళల 400 మీటర్ల ఈవెంట్‌లో హిమ దాస్ రజత పతకం సాధించింది. నేషనల్ రికార్డు టైమ్ 50.79 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె.. రెండోస్థానంలో నిలిచింది. 51 సెకన్లలోపు 400 మీటర్ల రేసు పూర్తి చేసిన తొలి ఇండియన్‌గా హిమ దాస్ రికార్డు సృష్టించింది.

రాణి రాంపాల్

రాణి రాంపాల్

ఆసియా గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు రజతంతో సరిపెట్టుకుంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాందీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్‌‌కు జేజేలు పలికిన భారత అభిమానులు.

స్వప్న బర్మన్

స్వప్న బర్మన్

ఆసియా గేమ్స్‌లో హెప్టాథ్లాన్‌లో స్వర్ణం నెగ్గిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన స్వప్న బర్మన్‌‌పై అభినందనల వెల్లువ. రాజ్‌బోంగ్షీ తెగకు చెందిన దిగువ మధ్య తరగతి కంటే తక్కువస్థాయి నిరుపేద కుటుంబానికి చెందిన స్వప్న ఆసియా గేమ్స్‌లో స్వర్ణంతో దేశంలో ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది. రెండు రోజులపాటు జరిగిన ఏడు క్రీడల్లో మొత్తం 6026 (కెరీర్‌ బెస్ట్‌) పాయింట్లతో హెప్టాథ్లాన్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల్లో హెప్లాథ్లాన్‌ స్వర్ణం నెగ్గిన స్వప్న బర్మన్‌కు పశ్చిమ బంగాల్‌ ప్రభుత్వం ఉద్యోగంతో పాటు రూ.10 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తేజిందర్ పాల్ సింగ్‌

తేజిందర్ పాల్ సింగ్‌

ఆసియా గేమ్స్‌లో షాట్‌పుట్‌లో స్వర్ణం నెగ్గిన తేజిందర్ పాల్ సింగ్‌తో సెల్ఫీ కోసం పోటీపడుతున్న భారత అభిమానులు. పూలదండలతో తేజిందర్ పాల్ సింగ్‌‌కు జేజేలు పలికిన భారత అభిమానులు. తేజిందర్‌పాల్ సింగ్ రికార్డు స్థాయిలో గుండుని 20.75 మీటర్లు విసిరి పసిడి పతకాన్ని గెలుపొందాడు. ఆసియా గేమ్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.

వికాస్ కృష్ణన్

వికాస్ కృష్ణన్

ఆసియా గేమ్స్‌లో భాగంగా జరిగిన బాకింగ్స్‌ ఈవెంట్‌లో కాంస్యం నెగ్గిన వికాస్ కృష్ణన్. బాక్సింగ్ 75 కేజీల సెమీఫైనల్ బౌట్‌ నుంచి గాయం కారణంగా తప్పుకోవడంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తద్వారా వరుసగా మూడు ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత తొలి బాక్సర్‌గా వికాస్ కృష్ణన్ అరుదైన ఘనత సాధించాడు. 2010లో 60 కేజీలో విభాగంలో స్వర్ణం, 2014లో మిడిల్ వెయిట్‌లో కాంస్య పతకాలను నెగ్గిన వికాస్ కృష్ణన్ తాజా ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం నెగ్గాడు.

Story first published: Tuesday, September 4, 2018, 19:56 [IST]
Other articles published on Sep 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X