న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలి స్విమ్మర్‌గా చరిత్ర.. ఇంగ్లీష్ చానల్‌ను నాలుగుసార్లు నాన్‌స్టాప్‌గా ఈదేసిన సారా!!

American Becomes 1st Person To Swim English Channel 4 Times Without Stopping

లండన్‌: అమెరికాలోని కొలరాడోకు చెందిన సారా థామస్‌ (37) రికార్డులోకి ఎక్కింది. గతేడాది కేన్సర్‌ వ్యాధిని జయించిన సారా థామస్‌ ఇంగ్లిష్‌ చానల్‌ను నాలుగు సార్లు నాన్‌స్టాప్‌గా ఈదేసి సంచలనం సృష్టించింది. సారా 54 గంటల్లో నాన్‌స్టాప్‌గా నాలుగు సార్లు చానల్‌ను ఈదేసింది. దీంతో ఈ రికార్డు సాధించిన తొలి స్విమ్మర్‌గా సారా థామస్‌ చరిత్ర సృష్టించింది. సారా బ్రెస్ట్‌ కేన్సర్‌కు చికిత్స చేయించుకున్న ఏడాదికే ఈ ప్రపంచ రికార్డు సాధించడం విశేషం.

'మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ధోనీ, కోహ్లీ వారి ప్రతిష్టలను త్యాగం చేయలేరు''మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ధోనీ, కోహ్లీ వారి ప్రతిష్టలను త్యాగం చేయలేరు'

సారా థామస్ ఆదివారం తెల్లవారుజామున బ్రిటన్‌ దక్షిణ తీరంలోని షేక్‌స్పియర్‌ బీచ్‌ నుంచి ఈ ఎపిక్ ఛాలెంజ్ ప్రారంభించింది. 54 గంటలకు పైగా ఇంగ్లిష్‌ చానల్‌ను నాలుగు సార్లు నాన్‌స్టాప్‌గా ఈదేసి మంగళవారం ఉదయం 6:30 గంటలకు డోవర్‌ పోర్టుకు చేరింది. దీంతో ఈ గ్రహం మీద మరే మానవుడు సాధించని ఘనతను సారా అందుకుంది. ఛానల్ స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రకారం.. ఇంగ్లీష్ ఛానల్ 21 మైళ్ళ వెడల్పుతో ఉంటుందట. సారా నీటిలోంచి బయటకు వచ్చినప్పుడు ఒడ్డున ఆమె కోసం ఎదురుచూస్తున్న శ్రేయోభిలాషుల బృందం ఆశ్చర్యపోయారు.

అనంతరం సారా థామస్ మాట్లాడుతూ... 'నేను నిజంగా నమ్మలేకపోతున్నా. నన్ను కలవడానికి బీచ్ ఒడ్డున చాలా మంది ఉన్నారు. వీరిని చూసి నేను ఆశ్చర్యపోయాను. కేన్సర్‌ వ్యాధిని జయించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ విజయం అంకితం. నేను ప్రస్తుతం చాలా అలసిపోయాను' అని పేర్కొంది. 'చలిని తట్టుకుంటూ, జెల్లీఫిష్‌లను తప్పించుకుంటూ, అలసటను అధిగమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది' అని నార్త్‌ పోల్‌ను తొలిసారిగా ఈదిన ప్రముఖ ఈతగాడు లూయిస్‌ పూ ప్రశంసించారు.

Story first published: Wednesday, September 18, 2019, 10:12 [IST]
Other articles published on Sep 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X