For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కడో తెలుసా?: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్ లోగో ఆవిష్కరణ

VIVO Pro Kabaddi League season 7 logo unveiled at Hussain Sagar lake in Hyderabad

జులై 20న ప్రొకబడ్డీ లీగ్ (పీకేఎల్‌) సీజన్‌-7 ప్రారంభం కానుంది. ఏడో సీజన్‌ కోసం సర్వం సిద్ధం అయింది. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన పీకేఎల్ ఏడో సీజన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ట్యాంక్‌బండ్ వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు టైటాన్స్‌ కెప్టెన్‌ అబోజర్‌, సిద్దార్థ్ దేశాయ్‌, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, బెంగళూరు బుల్స్ కెప్టెన్ రోహిత్ కుమార్, అరుణ్, శివ గణేశ్ రెడ్డి, పల్లె మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.

25 అడుగుల భారీ కటౌట్‌:

25 అడుగుల భారీ కటౌట్‌:

హుస్సేన్ సాగర్‌లోని బుద్ధుని విగ్రహం వద్ద 25 అడుగుల భారీ కటౌట్‌తో జరిపిన వేడుకలు అభిమానులను ఆకట్టుకున్నాయి. డ్యాన్స్ ప్రొగ్రామ్‌తో పాటు బాణా సంచాతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు వెలుగులు విరజిమ్మాయి. ఈ సీజన్‌ తొలి అంచె పోటీలకు నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. దీంతో గచ్చిబౌలీలో మ్యాచ్‌లు చూసేందుకు అభిమానుల కోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాట్లు చేసినట్లు లీగ్ నిర్వాహకులు తెలిపారు.

యు ముంబాతో టైటాన్స్ ఢీ:

యు ముంబాతో టైటాన్స్ ఢీ:

20వ తేదీ నుంచి జరిగే ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు యు ముంబాతో తలపడుతుంది. స్టార్‌రైడర్ సిద్దార్థ్ దేశాయ్ చేరికతో టైటాన్స్ జట్టు బలోపేతం అయింది. ఈ లీగ్‌ మ్యాచ్‌ల టికెట్లు https://www. eventsnow.com (ఈవెంట్స్‌ నౌ) వెబ్‌సైట్‌లో లభిస్తాయి. టికెట్ల ధరలను రూ. 500, రూ.800, రూ. 3000గా నిర్ణయించారు. టిక్కెట్లు కొనుక్కునేవారు ఈవెంట్స్‌ నౌ వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి కావాలసిన మ్యాచ్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

డబుల్‌ రౌండ్‌ పద్ధతిలో:

డబుల్‌ రౌండ్‌ పద్ధతిలో:

పన్నెండు జట్ల మధ్య టోర్నీని ఈసారి డబుల్‌ రౌండ్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. అన్ని జట్లు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడతాయి. లీగ్‌ దశ ముగిశాక తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ప్లేఆఫ్స్‌ నిర్వహిస్తారు. ఈ పోటీలు వివిధ నగరాల్లో సుమారు మూడు నెలల పాటు జరుగుతాయి. అక్టోబర్‌ 19న గ్రేటర్‌ నోయిడాలో జరిగే ఫైనల్‌తో ఏడో సీజన్‌ ముగుస్తుంది.

Story first published: Friday, July 19, 2019, 20:00 [IST]
Other articles published on Jul 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+