న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pro Kabaddi: భ‌ర‌త్ ఖాతాలో 100.. పాట్నా టాప్ ప్లేసు ప‌దిలం.. పుణే, పాట్నా, జైపూర్‌ జ‌య‌భేరి

Pro Kabaddi: Jaipur Pink Panthers beat U Mumbai, Patna Pirates beat Bengaluru Bulls and Puneri Paltan beat Tamil Thalaivas

బెంగ‌ళూరు: ప్రొ క‌బ‌డ్డీ లీగ్‌లో మ‌రో 3 ఆస‌క్తిక‌ర మ్యాచ్‌లు ముగిశాయి. యు ముంబాపై జైపూర్ పింక్ పాంథ‌ర్స్‌, తమిళ్ త‌లైవ‌స్‌పై పుణేరి ప‌ల్టాన్ ఘ‌న విజ‌యం సాధించాయి. ఉత్కంఠ భ‌రితంగా సాగిన మరో మ్యాచ్‌లో బెంగ‌ళూరు బుల్స్‌ను పాట్నా పైరేట్స్ ఓడిచింది. అటు ఈ మ్యాచ్‌తో బెంగ‌ళూరు బుల్స్ రైడ‌ర్ భ‌ర‌త్ ఈ సీజ‌న్‌లో 100 రైడ్ పాయింట్ల‌ను పూర్తి చేసుకున్నాడు.

జైపూర్ జ‌య‌భేరి

యుముంబా, జైపూర్ పింక్ పాంథ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో జైపూర్ ఘ‌న‌విజ‌యం సాధించింది. యుముంబాపై జైపూర్ 44-28 పాయింట్ల భారీ తేడాతో గెలిచింది. జైపూర్ జ‌ట్టులో అర్జున్ దేశ్వాల్ 17 రైడ్ పాయింట్ల‌తో చెల‌రేగాడు. బ్రిజేంద్ర సింగ్ చౌద‌రీ 8 రైడ్ పాయింట్ల‌తో స‌హ‌క‌రించాడు. నితిన్ రావ‌ల్ 4, సందీప్ ధుల్, విశాల్ మూడేసి పాయింట్లు సాధించారు. ఒక యు ముంబా జ‌ట్టులో అజిత్ కుమార్ 11 రైడ్ పాయింట్ల‌తో రాణించాడు. అభిషేక్ సింగ్ 5, శివ‌మ్ 4 పాయింట్లు సాధించారు. రాహుల్ సీతాఫ‌ల్, రింకు, క‌ల్మేష్ రెండేసి పాయింట్లు రాబ‌ట్టారు.

పాట్నా, బెంగ‌ళూరు హోరాహోరీ

పాట్నా పైరేట్స్‌, బెంగ‌ళూరు బుల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ పోరులో చివ‌ర‌కు బెంగ‌ళూరుపై పాట్నా 36-34 తేడాతో విజ‌యం సాధించింది. పాట్నా జ‌ట్టులో మోను గోయ‌త్ 9, సునీల్ 6, స‌చిన్ 5, చంద్ర‌శేఖ‌ర్ 3 పాయింట్లు సాధించారు. బెంగ‌ళూరు జ‌ట్టులో చంద్ర‌న్ రంజిత్ 8, ప‌వ‌న్ కుమార్ 7, భ‌ర‌త్‌, నంద‌ల్ నాలుగేసి పాయింట్లు సాధించారు. ఈ మ్యాచ్ ద్వారా ఈ సీజ‌న్‌లో 100 పాయింట్లు సాధించిన రైడ‌ర్‌గా బెంగ‌ళూరు బుల్స్ రైడ‌ర్ భ‌ర‌త్ నిలిచాడు. ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర స్థానాన్ని పాట్నా పైరేట్స్ మ‌రింత ప‌దిలం చేసుకుంది.

పుణే సూప‌ర్ విక్ట‌రీ

మ‌రో మ్యాచ్‌లో త‌మిళ్ త‌లైవ‌స్‌పై పుణేరి ప‌ల్టాన్ సూప‌ర్ విక్ట‌ర్ కొట్టింది. త‌మిళ్ త‌లైవ‌స్‌ను పుణే 43-31 పాయింట్ల తేడాతో ఓడించింది. పుణే జ‌ట్టులో మోహిత్ గోయ‌త్ సూప‌ర్ 10 సాధించాడు. అస్లాం 9, అభినేష్ 5, నితిన్ తోమ‌ర్, విశాల్ భ‌రద్వాజ్ నాలుగేసి, సొంబిర్ 3 పాయింట్లు సాధించారు. ఇక త‌మిళ్ తలైవ‌స్ జ‌ట్టులో హిమాన్ష్ 8, భ‌వానీ రాజ్‌పుత్ 7, సుర్జీత‌, అంజిక్యా ప‌వార్ మూడేసి పాయింట్లు సాధించారు.

Story first published: Wednesday, February 16, 2022, 8:37 [IST]
Other articles published on Feb 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X