న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుముంబా కెప్టెన్‌గా ఫజల్‌.. పుణెరి పల్టాన్‌ కెప్టెన్‌గా సుర్జీత్‌

Pro Kabaddi 2019: U Mumba pick Irans Fazel Atrachali as captain, Puneri Paltan appoint Surjeet Singh as skipper

ప్రపంచకప్‌-2019 గత ఆదివారంతో ముగిసింది. మెగా టోర్నీ ముగిసి వారం కాకముందే క్రీడా అభిమానులను అలరించడానికి ప్రొ కబడ్డీ (పీకేఎల్‌) సీజన్-7 సిద్ధమైంది. జులై 20న హైదరాబాద్‌ వేదికగా ప్రొ కబడ్డీ ఈవెంట్ ప్రారంభంకానుంది. అయితే అభిమానుల్లో మరింత జోష్ నింపడానికి లీగ్ నిర్వాహకులు జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుల మధ్య ఆల్‌స్టార్‌ మ్యాచ్‌ను నిర్వహించారు. గత శనివారం హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. వరల్డ్‌-7 జట్టుకు ఫజల్ అట్రాచాలి, ఇండియన్‌-7 జట్టుకు అజయ్‌ ఠాకూర్‌ కెప్టెన్లుగా వ్యవహరించారు.

ప్రపంచకప్‌లో రాయ్‌ విధ్వంసం.. తొలిసారి టెస్టు జట్టులో చోటుప్రపంచకప్‌లో రాయ్‌ విధ్వంసం.. తొలిసారి టెస్టు జట్టులో చోటు

యుముంబా కెప్టెన్‌గా ఫజల్‌:

యుముంబా కెప్టెన్‌గా ఫజల్‌:

ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను దక్కించుకున్నాయి. టైటిల్ లక్ష్యంగా అన్ని జట్లు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో యాజమాన్యాలు తమ జట్టులో మార్పులు చేస్తున్నాయి. యుముంబా జట్టు తమ కెప్టెన్‌గా ఫజల్‌ అట్రాచలీ (ఇరాన్‌)ని కొనసాగించింది. వైస్‌ కెప్టెన్‌గా సందీప్‌ నర్వాల్‌ను ప్రకటించింది. జులై 20న యుముంబా తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తో తలపడనుంది.

ముందుండి నడిపిస్తా:

ముందుండి నడిపిస్తా:

మరోసారి యు ముంబా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది. జట్టును ముందుండి నడిపిస్తా. టైటిల్ సాధించడానికి ప్రయత్నిస్తా. ఆటలో వ్యూహాలు చాలా ముఖ్యం, వాటిని అమలు చేయాలి. ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు' అని ఫజల్‌ అట్రాచలీ తెలిపాడు. 'వ్యూహాలు రచించడం ఆటలోకీలకం. వ్యూహాలు రచించడంలో ముందుంటా' అని వైస్‌ కెప్టెన్‌ సందీప్‌ నర్వాల్‌ అన్నారు.

పుణెరి కెప్టెన్‌గా సుర్జీత్‌ సింగ్‌:

పుణెరి కెప్టెన్‌గా సుర్జీత్‌ సింగ్‌:

టోర్నీ హాట్ ఫెవరేట్ పుణెరి పల్టాన్‌ కెప్టెన్‌గా సుర్జీత్‌ సింగ్‌ను ప్రకటించింది. 'జట్టును ముందుండి నడిపించే సత్తా సుర్జీత్‌కు ఉంది' అని కోచ్‌ అనూప్‌ కుమార్‌ అన్నారు. నితిన్‌ తోమర్‌చ గిరిష్‌ ఎర్నాక్‌, పవన్‌ కుమార్‌, దర్శన్‌ కడియన్‌లతో పుణెరి పల్టాన్‌ పటిష్టంగా ఉంది. కోచ్‌ అనూప్‌ కుమార్‌ గతంలో యుముంబాకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అతని సారథ్యంలో యుముంబా విజయ పథంలో దూసుకుపోయింది. మరి పుణెరి పల్టాన్‌ జట్టుకు అతని అనుభవం ఉపయోగపడనుంది.

Story first published: Thursday, July 18, 2019, 11:45 [IST]
Other articles published on Jul 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X