న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేబుల్‌ టాపర్‌ జైపూర్‌కు షాకిచ్చిన తెలుగు టైటాన్స్‌

PKL 2019: Vishal Bhardwaj helps clinch a win for the Telugu Titans vs Jaipur Pink Panthers

ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో టేబుల్‌ టాపర్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌కు తెలుగు టైటాన్స్‌ షాకిచ్చింది. ఉత్కంఠ పోరులో ఒత్తిడిని జయించిన తెలుగు టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 24-21తో పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. టైటాన్స్ డిఫెండర్‌ విశాల్‌ భరద్వాజ్‌ 8 టాకిల్‌ పాయింట్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. జైపూర్ తరఫున అగ్రశ్రేణి ప్లేయర్ దీపక్ హుడా (1 పాయింట్) విఫలం కావడం ఫలితంపై ప్రభావం చూపింది.

<strong>కాంస్యంతో సరి: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ముగిసిన సాయిప్రణీత్ పోరాటం</strong>కాంస్యంతో సరి: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ముగిసిన సాయిప్రణీత్ పోరాటం

టైటాన్స్ రైడర్ల కంటే డిఫెండర్లు అదరగొట్టారు. సిద్ధార్థ్ దేశాయ్ అద్భుతమైన పాయింట్‌తో టైటాన్స్ ఖాతా తెరిచాడు. దీపక్ నార్వాల్ బోనస్ సహాయంతో జైపూర్‌ ఖాతా తెరిచాడు. టైటాన్స్ డిఫెండర్లు పాయింట్లు ఇవ్వకపోవడంతో.. పాయింట్ల కోసం జైపూర్‌ కష్టపడింది. ఈ సమయంలో సిద్ధార్థ్ రెండుసార్లు సూపర్ టాకిల్ అవ్వడంతో ఎనిమిదో నిమిషంలో స్కోర్ సమం అయింది. విశాల్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో తొలి అర్ధ భాగాన్ని 11-14తో టైటాన్స్ ముగించింది.

రెండవ సగంను టైటాన్స్ బాగానే ప్రారంభించింది. అజింక్యపై విజయవంతమైన సూపర్ టాకిల్ చేసిన భరద్వాజ్ హై 5ని కూడా పూర్తి చేశాడు. మరోవైపు ఫర్హాద్‌ మిలాగ్రదన్‌, సిద్దార్థ్‌ దేశాయ్‌ సహకారం అందించారు. దీంతో టైటాన్స్ మెరుగైన స్థితికి చేరింది. చివర్లో టైటాన్స్‌ సారథి అబొజర్‌ తన అనుభవంతో ప్రత్యర్థిని పట్టేసి జట్టుకు విజయాన్ని అందించాడు. లీగ్‌లో భాగంగా 10 మ్యాచ్‌లాడిన టైటాన్స్ (23 పాయింట్లు) 3 విజయాలు, 5 పరాజయాలు, 2 డ్రాలతో పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరింది. మరోవైపు టైటాన్స్ చేతిలో ఓడినా.. జైపూర్ 37 పాయింట్లతో అగ్రస్థానంలోనే ఉంది. టైటాన్స్ తరఫున విశాల్ భరద్వాజ్ (8 పాయింట్లు) ట్యాక్లింగ్ హైఫై సాధించగా.. స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ (3 పాయింట్లు) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

Story first published: Sunday, August 25, 2019, 11:13 [IST]
Other articles published on Aug 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X