Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సొంతగడ్డపై అదరగొట్టిన బుల్స్: పట్నాపై ఉత్కంఠ విజయం

Pro Kabaddi League 2019 : Bengaluru Bulls Fightback To Clinch Thrilling Win Over Patna Pirates
PKL 2019: Hosts Bengaluru Bulls fightback to clinch thrilling win over Patna Pirates


హైదరాబాద్:
సొంతగడ్డపై బెంగళూరు బుల్స్ మరోసారి అదరగొట్టింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో స్టార్‌ రైడర్‌ పవన్‌ షెరావత్‌(17పాయింట్లు) మరోసారి విజృంభిచడంతో బెంగళూరు బుల్స్ 40-39తో పాట్నా పైరేట్స్‌ విజయం సాధించింది. బెంగళూరు జట్టు తరుపున ట్యాక్లింగ్‌లో మహేందర్‌ సింగ్‌(5పాయింట్లు)తో మెరిశాడు.

ఇక, పాట్నా స్టార్‌ రైడర్‌ పర్‌దీప్‌ నర్వాల్‌(14) చివరి దాకా పోరాడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మ్యాచ్ ఆరంభం నుంచీ హోరాహోరీగా సాగింది. మ్యాచ్‌ 12వ నిమిషంలో పర్దీప్‌ ఓ అద్భుతమైన రైడ్‌తో బెంగళూరు బుల్స్‌ను ఆలౌట్ చేయడంతో పట్నా పైరేట్స్ 13-7ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఈ క్రమంలో బెంగళూరు బుల్స్ రైడర్స్ పవన్ షెరావత్ విజృంభించి వరుస పాయింట్లు సాధించడంతో పట్నాకు చేరువైంది. తొలి అర్ధభాగం ముగిసే సరికి పాట్నా పైరేట్స్ 29-24తో ఆధిక్యంలో నిలిచింది. ఇక, రెండో అర్ధభాగంలోనూ చాలాసేపు పాట్నా పైరేట్స్ ఆధిక్యంలోనే కొనసాగింది. ఈ క్రమంలో 50సార్లు సూపర్‌ 10 సాధించిన తొలి ప్లేయర్‌గా పర్దీప్‌ చరిత్ర సృష్టించాడు.

ఒకానొక దశలో పట్నా పైరేట్స్ 37-29తో నిలవడంతో అందరూ ఆ జట్టు విజయం ఖాయమని అనుకున్నారు. అయితే, అనూహ్యాంగా బెంగళూరు ఒక్కసారి రేసులోకి వచ్చింది. పర్దీప్‌ నర్వాల్‌ను బెంగళూరు కెప్టెన్ అజయ్‌ ఠాకూర్ ఔట్ చేయడంతో ఆ తర్వాత పాట్నాను ఆలౌట్‌ చేయడంతో బుల్స్‌ పోటీలోకి వచ్చింది. ఆ తర్వాత పైరేట్స్‌ ఆధిక్యాన్ని క్రమంగా తగ్గించింది.

చివర్లో బుల్స్ స్టార్ రైడర్ పవన్‌‌తో పాటు డిఫెండర్లు రాణించడంతో ఏకంగా 38-38తో పాయింట్లు సమం చేసింది. చివరి నిమిషంలో ఒక్క పాయింట్‌ తేడాతో పాట్నాపై విజయం సాధించింది. అంతకముందు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ 46-44తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఓడించింది.

ప్రొ కబడ్డీలో గురువారం
పుణెరి vs యు ముంబా (రాత్రి 7:30 నుంచి)

Story first published: Thursday, September 5, 2019, 8:37 [IST]
Other articles published on Sep 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+