న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైంగికంగా వేదిస్తున్నారు.. మమ్మల్ని కాపాడండి..!!

AP women players accuse Kabaddi Association general secretary of sexual harassment

హైదరాబాద్: లైంగికంగా వేదిస్తున్నారంటూ ఏపీ కబడ్డీ సంఘంలో చెలరేగిన ఆరోపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమను ఏపీ కబడ్డీ సంఘం కార్యదర్శి కార్యదర్శి వీరలంకయ్య వేధిస్తున్నాడంటూ, సర్టిఫికేట్లు అమ్ముకున్నాడని ఆరోపిస్తూ.. పలువురు మహిళా క్రీడాకారిణులు మీడియా ముందు వెల్లడించారు. కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి శ్రీకాంత్‌తో కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

దీనిలో భాగంగా ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ అవతవకలపై చర్యలు తీసుకోవాలన్నారు. వేదింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని శ్రీకాంత్‌ నిలదీశారు. వీరలంకయ్యకు ఏపీ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ సపోర్టు ఉందని అన్నారు.

తాను క్షమాపణ కోరుతూ లేఖ రాశానని ప‍్రభాకర్‌ చెబుతున్న విషయం కూడా అబద్ధమని పేర్కొన్న శ్రీకాంత్‌.. అది ఫోర్జరీ చేసిన లెటర్‌ అని తెలిపారు. దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. తాను ఎటువంటి అవినీతికి పాల‍్పడలేదని ఈ సందర్బంగా పేర్కొన్నారు.

మరొకవైపు వీరలంకయ్యపై చర్యలు తీసుకోవాలని పలువురు మహిళా క్రీడాకారిణులు కోరుతున్నారు. మహిళా క్రీడాకారిణులను వీర లంకయ్య వేధించకపోతే ఆయన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేశారని ప్రశ్నించారు. ఆయన్ని వెంటనే అసోసియేషన్ నుంచి వెంటనే తొలగించడంతో పాటు, దొంగ సర్టిఫికేట్ పై ఏసీబీ విచారణ జరిపించాలన్నారు. ఒక్కొక్క సర్టిఫికేట్‌ను ఏడున్నర లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ను రద్దు చేసే అధికారం స్టేట్‌ బాడీకు లేదన్నారు.

Story first published: Sunday, June 24, 2018, 17:08 [IST]
Other articles published on Jun 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X